కొత్త సంవత్సరంలో సలార్ షూటింగ్‌ అప్‌డేట్‌

Update: 2023-01-05 13:43 GMT
కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం సలార్‌. యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు మొదలు అయ్యి చాలా నెలలు అయ్యింది. మొదట షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటికే సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది.

కేజీఎఫ్‌ 2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో సలార్ ను మరింత భారీగా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. అందుకే షూటింగ్‌ ఆలస్యం అవుతుంది. పైగా ప్రభాస్ పలు సినిమాలకు కమిట్ అయ్యి ఉండటం వల్ల కూడా సలార్‌ సినిమా షూటింగ్ లేట్‌ అవుతూ వస్తుంది.

ఈ కొత్త సంవత్సరంలో సలార్‌ కొత్త షెడ్యూల్‌ ను ఈనెల 8వ తారీకు నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారంలో ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ లో క్లైమాక్స్ కు చెందిన అత్యంత ఆసక్తికర సన్నివేశాలు మరియు యాక్షన్‌ సన్నివేశాలను భారీ ఎత్తున చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేశాడట.

హంబుల్‌ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ అనుకున్నట్లుగా జరగకుంటే మాత్రం ఈ ఏడాదిలో కూడా సలార్‌ ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానమే అన్నట్లుగా మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News