యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. పాన్ ఇండియా స్టార్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి అనుకోని విధంగా ఫ్యాన్స్ కు ఓ సర్ప్రైజ్ అందింది.
'సలార్' సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సెట్ లో ప్రభాస్ పై చిత్రీకరిస్తున్న సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి లీక్ అయింది. ప్రభాస్ గ్యాంగ్ తో కలిసి నిల్చొని సీరియస్ గా లుక్ ఇచ్చే సీన్ అది. ఇందులో ఊర మాస్ అవతార్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు.
ప్రభాస్ నుంచి చాలా కాలంగా అప్డేట్ కోసం వేచి చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.. 'సలార్' నుంచి లీకైన వీడియోలో రఫ్ లుక్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో క్లిప్ కి రకరకాల బ్యాగ్రౌండ్ స్కోర్ సెట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు..
అయితే ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణించడంతో 'సలార్' తో పాటుగా మిగతా సినిమాల నుంచి కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో మేకర్స్ షూటింగ్స్ హోల్డ్ చేసుకొని.. ప్రభాస్ కోసం వేచి చూస్తున్నారు. అయితే నిర్మాతలు ఇబ్బంది పడకూడదని.. పెదనాన్న కు చేయాల్సిన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రభాస్ తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో 'సలార్' షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన లీకైన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ హాఫ్ హ్యాండ్ షర్ట్ మరియు మెడలో చైన్ తో మాస్ లుక్ లో దర్శనమిచ్చారు.
ఇప్పటికే విడుదలైన 'సలార్' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా డార్లింగ్ ని పరిచయం చేసారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.