14వ సారి ముచ్చటగా 100 కోట్లు

Update: 2019-06-08 14:30 GMT
కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈద్ పండగను బాగా క్యాష్ చేసుకుంటున్నాడు. అతని లేటెస్ట్ మూవీ భారత్ కు ఫుల్ పాజిటివ్ రిపోర్ట్స్ రాకపోయినా వీకెండ్ ని వాడుకుంటూ ఈరోజుతో వంద కోట్ల మార్కును అధికారికంగా దాటేశాడు. సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలవుతుంది కానీ ఇప్పటికైతే కంటెంట్ ఎలా ఉన్నా వసూళ్ల వర్షం కురిపించడంలో తనకు తిరుగు లేదని సల్లు భాయ్ మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇంకో అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు సల్మాన్.

ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా హీరోకు సాధ్యం కానీ రీతిలో మొత్తం 14 సినిమాలు వంద కోట్ల వసూళ్లు దాటినవి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు వందల కోట్లు దాటినవి రెండు ఉండగా మూడు వందల కోట్లు దాటినవి ఏకంగా మూడు ఉన్నాయి. మంచి నీళ్లు తాగినంత సులభంగా ఇలా రాబట్టడం చూసి ట్రేడ్ సైతం షాక్ అవుతోందిసల్మాన్ ఖాన్ ఈ ఫీట్ సాధించడం పట్ల ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు.

సుల్తాన్ - భజరంగి భాయ్ జాన్ - కిక్ - ప్రేమ్ రతన్ ధన్ పాయో - ఏక్ తా టైగర్ - టైగర్ జిందా హై - దబాంగ్ - దబాంగ్ 2 - బాడీ గార్డ్ - రెడీ - జయహో - రేస్ 3 - ట్యూబ్ లైట్ లతో భారత్ ను జోడిస్తే మొత్తం 100 కోట్ల సినిమాలు పధ్నాలుగు అయ్యాయి. ఇప్పుడు భారత్ టూ హండ్రెడ్ మార్క్ దాటుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వంద కోట్లు రాబట్టిన సినిమాల్లో కూడా డిజాస్టర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఇతరులు 90 కోట్లకే హిట్ అని చెప్పుకునే వాటితో పోలిస్తే సల్మాన్ కు పరాజయమే లేదన్నది ఫ్యాన్స్ వెర్షన్. భారత్ కనక యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే రికార్డుల ఊచకోత ఇంకే స్థాయిలో ఉండేదో


Tags:    

Similar News