స‌ల్మాన్ ఖాన్ తో అలీ అబ్బాస్ మ‌రోసారి భారీ యాక్ష‌న్!

Update: 2022-09-16 15:30 GMT
బాలీవుడ్ భాయ్ స‌ల్మాన్ ఖాన్- అలీ అబ్బాస్ స‌క్సెస్ ఫుల్ కాంనేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి క‌ల‌య‌క‌లో తెర‌కెక్కిన చిత్రాల‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వ‌రుస‌గా మూడు హిట్లు అందుకున్న ద్వ‌యం అది. 'సుల్తాన్'..'టైగ‌ర్ జిందా హై'.. 'భార‌త్' వంటి భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో ప‌సందైన వినోదాన్ని అందించారు.  యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా ఖ్యాతికెక్కారు.

ఆ మూడు బాక్సాఫీస్ వ‌ద్ద కోట్ల వ‌ర్షం కురిపించాయి. అప్ప‌టి నుంచి ఈ కాంబినేష‌న్ లో సినిమా అంటే ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. భాయ్ తో అబ్బాస్  చేతులు క‌లిపితే బాక్సాఫీస్ మోత‌కే ఫిక్స్ అయిన‌ట్లే అనే అంచ‌నాలున్నాయి. తాజాతా మ‌రోసారి ఆ స‌క్సెస్ కాంబినేష‌న్  మ‌రో సినిమా చేయ‌డానికి  రెడీ అవుతుంది. భాయ్ తో అలీ అబ్బాస్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కి రంగం సిద్దం చేస్తున్న‌ట్లు రివీల్ చేసారు.

''స‌ల్మాన్ సార్ తో భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌బోతున్నాను. ప‌క్కా యాక్ష‌న్ అంశాల‌తో చిత్రం సాగుతుంది. అతి త్వ‌రలోనే పూర్తి క‌థ‌ని వినిపించ‌బోతున్నాను' అని   తెలిపారు.  ఇప్ప‌టికే భాయ్ కి స్టోరీ లైన్ వినిపించారు.

ఆయ‌న పాజిటివ్ గా స్పందించ‌డంతో బౌండెడ్  స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.   దీంతో ఈ కాంబినేష‌న్ పై అప్పుడే అంచ‌నాలు  మొద‌లైపోయాయి. భాయ్ ని ఎలాంటి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో చూపించ‌నున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ మొద‌లైంది.

ప్ర‌స్తుతం అలీ అబ్బాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'జోగీ' నెట్ ప్లిక్స్ రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలాగే అక్ష‌య్ కుమార్..టైగ‌ర్ షాప్ ల‌తో 'బ‌డేమియా చోటామియా' చిత్రాన్ని  తెర‌కెక్కిస్తున్నారు.  క‌త్రినా కైఫ్ మెయిన్ లీడ్ లో 'సోల్జ‌ర్' రూపొం దిస్తున్నారు.  మ‌రోవైపు షాహిద్ క‌పూర్ తో సినిమా  చేయాల్సి ఉంది.  అటు స‌ల్మాన్ చేతిలో ప‌లు ప్రాజెక్ట్ లున్నాయి.

'క‌బీ ఈద్ క‌బీ దివాలీ'..'టైగ‌ర్ 3' చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అలాగే 'ప‌ఠాన్'  ..'గాడ్ ఫాద‌ర్' చిత్రాల్లోనూ గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇస్తున్నారు. మ‌రోవైపు క‌న్న‌డ న‌టుడు..ద‌ర్శ‌కుడు సుదీప్ తోనూ ఓ సినిమా క‌మిట్ అయ్యారు. ఇవ‌న్నీ  పూర్త‌యిన త‌ర్వాత భాయ్  అబ్బాస్ కాంబినేష‌న్  సెట్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News