నా పెళ్ళి నవంబర్ 18న అంటున్న సల్మాన్‌

Update: 2016-07-18 06:21 GMT
ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే మాట వినగానే గుర్తొచ్చే మొదటి పేరు సల్మాన్ ఖాన్. ఈ బాలీవుడ్కండల వీరుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే ఆసక్తి అభిమానుల్లో చాలానే ఉంది. ఈ మధ్య ఇరానియన్ మోడల్ లూలియా వంతోర్ తో ఎక్కువగా కనిపిస్తుండడంతో., సల్మాన్ పెళ్లి వార్తలు బాగా పెరిగాయి. ప్రస్తుతం సుల్తాన్ హిట్ తో మంచి ఊపుమీదున్న సల్లూ భాయ్.. పనిలో పనిగా తన పెళ్లి డేట్ అనౌన్స్ చేసేశాడు.

రీసెంట్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆత్మకథ రాసేసింది. ఏస్ ఎగైనెస్ట్ ఆడ్స్ అనే టైటిల్ పై సానియా లైఫ్ స్టోరీ బుక్ రాగా.. దాని ఆవిష్కరణకు సల్మాన్ వచ్చాడు. అక్కడ 'మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు' అని సానియా మీర్జా డైరెక్టుగా అడిగేసింది. దీంతో కాసేపు ఆలోచించుకున్న సల్మాన్ ఖాన్ ' మా అమ్మానాన్నలయిన సల్మా -  సలీమ్ ఖాన్ లు నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి నేను కూడా అదే రోజున పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా' అని చెప్పిన సల్మాన్.. అసలు విషయం ఆ తర్వాత చెప్పాడు.

'ఇలాంటి నవంబర్ 18లు నా లైఫ్ లో ఓ ఇరవై పాతిక వెళ్లిపోయాయ్ కాని పెళ్లి మాత్రం అవలేదు. నవంబర్ 18నే పెళ్లి చేసుకుంటా కానీ.. అది ఏ సంవత్సరమో తెలీదు' అన్నాడు సల్మాన్. బాగుంది కదూ సల్మాన్ వరస. ఇలా అయితే ఇక పెళ్లి చేసుకున్నట్లే.
Tags:    

Similar News