ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా .. అందరూ ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ట్ ఆర్ ఆర్'. ఈ సినిమా కోసం అందరూ ఇంతగా ఎదురు చూడటానికి కారణం ఒకటి దర్శకుడు రాజమౌళి .. రెండవది ఒకే రేంజ్ క్రేజ్ కలిగిన ఎన్టీఆర్ - చరణ్ సమాన ప్రాధాన్యత కలిగిన పవర్ఫుల్ పాత్రలు చేయడం. మూడవది కథా నేపథ్యం. ఈ మూడు అంశాలు అందరిలోను విపరీతమైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతవరకూ రాజమౌళి నుంచి వచ్చిన ఏ సినిమా పరాజయంపాలు కాలేదు. పైగా ఒక సినిమాను మించి మరో సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డు సెట్ పెట్టాయి.
అలాంటి రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 7వ తేదీన థియేటర్స్ లో దింపేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ముంబైలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ ను లైవ్ టెలికాస్ట్ చేయలేదు. డిసెంబర్ 31వ తేదీన స్టార్ ప్లస్ లో ప్రసారం చేస్తారట. కరణ్ జొహార్ తో పాటు 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ అంతా కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైంది.
సల్మాన్ ఖాన్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా వచ్చాడు. దాంతో ఈ వేదిక మరింత నిండుదనాన్ని తెచ్చుకుంది. సల్మాన్ ఇమేజ్ ఈ ఈవెంట్ ను మరో స్థాయికి తీసుకుని వెళ్లింది. ఈ వేడుకలో సల్మాన్ మాట్లాడుతూ .. "రాజమౌళి గారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన ఏమిటనేది ఆయన సినిమాలే చెప్పేశాయి. ఇండియన్ సినిమాను ఆయన ప్రపంచస్థాయికి తీసుకుని వెళ్లారు. అన్ని భాషలకి చెందిన హీరోలంతా ఏ దర్శకుడితో కలిసి పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపుతారో .. ఆ దర్శకుడే రాజమౌళి.
అలాంటి రాజమౌళి నుంచి వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంబంధించిన టీజర్లు .. ట్రైలర్లు నేను చూశాను. ఈ సినిమా ఎలా ఉండనుందనే విషయంలో నాకు ఒక అవగాహనా వచ్చింది. అందువల్లనే చెబుతున్నాను .. ఒక 4 నెలల వరకూ ఎవరూ కూడా తమ సినిమాల రిలీజ్ లు పెట్టుకోవద్దు. అలా గనుక చేస్తే అది ఒక పెద్ద సాహసమే అవుతుంది. ఆ స్థాయిలో 'ఆర్ ఆర్ ఆర్' తన ప్రభావం చూపుతుంది. ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. ఇది ఒక తుఫాన్ లాంటిది .. ఒక తుఫాన్ కోసం ఎదురుచూడటం ఇదే ఫస్టు టైమ్ అనుకుంటాను.
ఇక చరణ్ విషయానికి వస్తే తాను నాకు చాలా కాలంగా తెలుసు. ఎప్పుడు చూసినా ఏదో ఒక షూటింగులో అయిన గాయంతోనే కనిపిస్తూ ఉంటాడు. ఆయనలాంటి హార్డ్ వర్కర్ ను నేను చూడలేదు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే తాను మంచి యాక్టర్ .. అంతకు మించి మంచి డాన్సర్. ఆయన డాన్స్ కి నేను కూడా అభిమానినే. ఆయన ఎంతలా కష్టపడతాడనే విషయాలను నేను విన్నాను" అంటూ ఎన్టీఆర్ ని అభినందించాడు.