మొన్న ఈద్ పండగ సందర్భంగా విడుదలైన భారత్ వసూళ్ల భరతం పడుతూనే ఉంది. టాక్ తో పాటు రివ్యూస్ మిక్స్డ్ గా వచ్చినా ఇంకే ఆప్షన్ లేని కారణంతో పాటు ఏడాది తర్వాత వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీగా ప్రేక్షకులు సాఫ్ట్ కార్నర్ తో కలెక్షన్స్ ని పోటీ పడి అందిస్తున్నారు. వీకెండ్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకోబోతున్న సల్మాన్ ఇప్పుడు భారత్ ని ఆల్ టైం థర్డ్ బెస్ట్ ఓపెనర్ గా నిలిపాడు.
సుమారు 42 కోట్ల 10 లక్షల చిలుకు మొత్తంతో రెండో స్థానంలో ఉన్న హ్యాపీ న్యూ ఇయర్ (44 కోట్ల 96 లక్షలు) ఫస్ట్ ప్లేస్ కొట్టేసిన తగ్స్ అఫ్ హిందుస్థాన్ (52 కోట్ల 25 లక్షలు) తర్వాత ప్లేస్ ని ఆక్రమించాడు. తన కెరీర్ బెస్ట్ ప్రేమ్ రతన్ ధన్ పాయో(40 కోట్ల 33 లక్షలు)ని క్రాస్ చేసిన భారత్ ఫైనల్ గా సల్మాన్ అల్ టైం బెస్ట్ ఓపెనర్ గా స్థానాన్ని ఖాయం చేసుకుంది. దీంతో సల్లు భాయ్ ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. టాక్ దారుణంగా ఉంటే తప్ప సల్మాన్ సినిమాలు దెబ్బ కొట్టవు.
దీనికి యావరేజ్ అనే మాట వచ్చింది కాబట్టి ప్రేక్షకులు తామే హిట్ వైపు లాక్కెళ్లిపోయేలా ఉన్నారు. అయితే వీకెండ్ తర్వాత సోమవారం నుంచి బాక్స్ ఆఫీస్ ని ఎలా మేనేజ్ చేస్తాడు అనే దాన్ని బట్టి భారత్ ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. విచిత్రంగా పైన రికార్డులు కొట్టినట్టు చెప్పుకున్న సినిమాలన్నీ డిజాస్టర్లే కావడం. వీటిలో ఏదీ ఇండస్ట్రీ హిట్ కాదు. కేవలం ఓపెనింగ్స్ లో ప్రతాపం చూపించి ఆ తర్వాత తుస్సుమన్నవి. మరి భారత్ అదే కోవలోకి చేరుతుందా లేక ట్రెండ్ ని మార్చి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందా వేచి చూడాలి