రికార్డులు కొట్టడానికి తనకు కంటెంట్ తో పనిలేదని కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి రుజువు చేశాడు. యావరేజ్ రిపోర్ట్స్ వస్తున్నా కూడా అతని కొత్త సినిమా భారత్ మొదటిరోజు బాక్స్ ఆఫీస్ భరతం పట్టేసింది. సరిగా పండగ రోజే రావడం బాగా కలిసి వచ్చింది. ముస్లిం ఫ్యాన్స్ నెలరోజుల దీక్షలు ముగించుకుని థియేటర్ల మీద దాడి చేసినంత పని చేశారు. ఫలితంగా వసూళ్ల ఊచకోత తప్పలేదు. ఇందులో అధిక శాతం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రావడం గమనార్హం. దీని ద్వారా తాను ఎంత క్రౌడ్ పుల్లరో మరోసారి సల్మాన్ రుజువు చేశాడు.
లెక్కల విషయానికి వస్తే ఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో 42 కోట్ల 30 లక్షల వసూళ్లతో భారత్ టాప్ 1 స్థానాన్ని కొట్టేసింది. తర్వాత రెండో స్థానంలో ఉన్న కళంక్ అందులో కేవలం సగం మాత్రమే అంటే 21 కోట్ల 60 లక్షలతో ఉండటం గమనార్హం. ఇక సల్మాన్ ఖాన్ ఈద్ పండగ సందర్భంగా కొత్త సినిమాను విడుదల చేసే ట్రెండ్ 2010 నుంచి ఫాలో అవుతున్నాడు. దాని పరంగా కూడా ఇప్పటిదాకా టాప్ ప్లేస్ లో ఉన్న సుల్తాన్ (36 కోట్ల 56 లక్షలు)ను భారత్ మంచి మార్జిన్ తో దాటేశాడు. మిగిలినవన్నీ ముప్పై కోట్ల లోపే ఉండటం విశేషం.
ఈ ట్రెండ్ ఈ వీకెండ్ దాకా కొనసాగితే ఆల్ టైం టాప్ 5లో చేరుతుందని ట్రేడ్ అంచనా. అయితే అదంతా ఈజీ కాదు. భారత్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నా టాక్ మాత్రం డివైడ్ గానే ఉంది. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. యావరేజ్ స్టఫ్ ఉన్నా తన ఛరిష్మాతో నెట్టుకొచ్చే సల్మాన్ దీనికీ అదే సూత్రం వర్తింపజేసేలా ఉన్నాడు. ఇంకో రెండు రోజులు ఆగితే స్టేటస్ మీద ఓ క్లారిటీ వస్తుంది. గత రెండు డిజాస్టర్లు ట్యూబ్ లైట్-రేస్ 3ల కంటే భారత్ నయమనిపించుకోవడం సల్లు ఫ్యాన్స్ ని రిలాక్స్ అయ్యేలా చేస్తోంది.