ఉన్నంత కాలం విలువ తెలీలేదు.. పోయాక తెలిస్తే ఏం లాభం? సారీ చెబితే పెద్దాయన ఆత్మ శాంతిస్తుందా? ఏంటిది సల్లూ భాయ్? .. ఇదీ సోషల్ మీడియాల్లో భాయ్ ని నిలదీస్తూ చింతూ సర్ అలియాస్ రిషీజీ అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలు. పోయినోళ్లంతా మహానుభావులు.. ఇకనైనా తెలిసిందా భాయ్? అన్నట్టుగా సెటైర్లు వేస్తున్నారు. అసలిదంతా ఎందుకు అంటారా?
చాలా డీటెయిల్స్ లోకి వెళ్లాలి మరి. ఎంతో బ్రాడ్ గా ఓపెన్ గా కనిపించే బాలీవుడ్ హీరోల్లో బయటి ప్రపంచానికి తెలియని కోణాలెన్నో. అసలు ఈ రంగుల ప్రపంచంలో ఈగోలు గొడవలకు అంతూ అన్నదే ఉండదని సల్మాన్ - రిషీ కపూర్ వైరం చెబుతుంది. ఆరంభం గురు శిష్యుల్లాగా.. స్నేహితుల్లాగా ఎంతో ఆప్యాయంగా ఉన్న వీళ్లే ఒకానొక రోజు గొడవలతో విడిపోయారు. ఇక వివాదాలకు సామాన్యుడు మాన్యుడు అనే తేడానే లేదని చాలాసార్లు ప్రూవైంది. అసలింతకీ సల్మాన్ - రిషీ కపూర్ మధ్య వివాదం ఏమిటి? ఎందుకు? అంటే.. అప్పట్లో రిషీ కపూర్ వారసుడు రణబీర్ కపూర్ .. సల్మాన్ ప్రేయసి కత్రినతో ప్రేమలో నిండా మునిగినప్పుడు అది భాయ్ కి ఎంతమాత్రం రుచించని సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రణబీర్ ని సల్మాన్ భాయ్ దూరం పెట్టేశాడు. అతడితో కనీస మాత్రంగా అయినా మాట్లాడనే లేదని ప్రచారమైంది. అంతేకాదు.. రణబీర్ కపూర్ `సావారియా`లో నటించే సమయంలో సల్మాన్ చెంప దెబ్బ కొట్టాడని రణబీర్ వైఖరి నచ్చక అలా కొట్టేశాడని ప్రచారమైంది. అంతేకాదు సోనమ్ కపూర్- ఆనంద్ అహూజా పెళ్లి విందులో రిషీ కపూర్ తో సల్మాన్ మాట్లాడలేదని పాత గొడవల వల్లనే ఇలా జరిగిందని ప్రచారం వేడెక్కించింది.
నిన్నటిరోజున రిషి కపూర్ మరణ వార్త బాలీవుడ్ లో విషాదం నింపడంతో సల్మాన్ ఖాన్ ఒక మెట్టు దిగొచ్చాడు. ఒక సామాన్యుడిలా స్పందించి రిషీజీపై ట్వీట్ చేసాడు. అయితే ఇన్నాళ్లు తండ్రి కొడుకులైన రిషీజీ-రణబీర్ లతోను ఆ కుటుంబం వ్యక్తులతోనూ భాయ్ కి సరైన సత్సంబంధాలు లేనందున ఆ ట్వీట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఊహించనిది. చింతూజీ(రిషీజీ) లాంటి గొప్ప నటుడిని కోల్పోయినందుకు సంతాపం తెలిపిన సల్మాన్ ``రెస్ట్ ఇన్ పీస్ చింటు సర్.. కహా సునా మాఫ్... స్ట్రెంగ్త్ అండ్ పీస్ ఎన్ లైట్ ఫ్యామిలీ ఎన్ ఫ్రెండ్స్ ...`` అని ట్వీట్ చేశారు. సల్మాన్ ఇలా క్షమాపణ చెప్పడం నిజంగా గొప్ప విషయం. అయితే మనిషి లేనప్పుడు ఇలా క్షమాపణ కోరడం ఏమిటా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆలస్యం అయినా కానీ సల్మాన్ ఒక మెట్టు దిగి వచ్చినందుకు కపూర్ ఫ్యామిలీ దానిని నోటీస్ చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇకపై అయినా రణబీర్ తో సల్మాన్ భాయ్ యథావిధిగా కలిసిపోతాడా లేదా? అన్నది చూడాలి.