రొమేనియా బ్యూటీతో బ్రేకప్??

Update: 2016-11-11 03:59 GMT
ఈ ఏడాది బాలీవుడ్ లో బ్రేకప్ ల సీజన్ బాగానే నడిచింది కానీ.. ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ మాత్రం ఓ ఇంటివాడు అయిపోతాడని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. రొమేనియన్ సుందరి యూలియా వంతూర్ తో సల్మాన్ పెళ్లి ఖాయం కానుందనే వార్తలు వచ్చాయి. పైగా నా పెళ్లి నవంబర్ 18న అంటూ.. ఓ ఆశ్చర్యకరమైన స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు సల్మాన్ ఖాన్.

ఏ ఏడాది చేసుకుంటాడో చెప్పలేదు కానీ.. సల్మాన్-యూలియాల సాన్నిహిత్యం చూశాక.. ఈ ఏడాదే అని మీడియా ఫిక్స్ అయిపోయింది. కనీసం ఎంగేజ్మెంట్ కబురైనా సల్లూ భాయ్ చెప్పేస్తాడని అనుకుంటే.. ఇప్పుడు కొత్త కబురు వినాల్సి వస్తోంది. ప్రస్తుతం సల్మాన్-యూలియాలు మాట్లాడుకోవడం లేదని.. ఎడమొహం పెడమొహం అయిపోయారంటూ బాలీవుడ్ గుసగుసలాడుకుంటుంటే.. ఇండియా మొత్తం ఆ సౌండ్ రీసౌండ్ వచ్చేస్తోంది.

యూలియా వంతూర్ కి గతంలో పెళ్లైందనే విషయం తెలియడం(సల్మాన్ కి ముందే తెలుసుంటుందిలే).. ఇప్పటికీ అతనితో యూలియా టచ్ లో ఉండడమే ఇందుకు కారణంగా చెప్పుకుంటున్నారు. ఆ రిలేషన్ కట్ చేయనపుడు.. నాతో ఎందుకు కంటిన్యూ చేయడం అంటూ.. కట్ చేసేశాడట సల్మాన్ ఖాన్. ఈ వార్తలు నిజమే అయితే మాత్రం.. ఈ ఏడాది సుల్తాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ నే కాదు.. బిగ్గెస్ట్ బ్రేకప్ కూడా సల్మాన్ ఖాతాలోనే పడుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News