'బీయింగ్ హ్యూమన్' పేరుతో ఓ ఎన్జీవో పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు సల్మాన్ ఖాన్. ఐతే సల్మాన్‌కు జైలు శిక్ష పడ్డప్పుడు అతడి అభిమానులు, మద్దతుదారులు.. ఈ సేవా కార్యక్రమాల గురించే ప్రస్తావించారు. ఇంత సేవ చేస్తున్న వాడిని జైల్లో పెడతారా అంటూ చిత్రమైన లాజిక్‌లు తీశారు. ఈ లాజిక్ వర్కవుటైతే.. ఇకపై నేరం చేసిన ప్రతివాడూ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేసేస్తే సరిపోతుందని భావిస్తాడేమో.
ఆ సంగతి పక్కనబెడితే హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడినా.. ఆ తర్వాత హైకోర్టు తీర్పుతో ఉపశమనం పొందిన సల్మాన్ ఎంచక్కా కాశ్మీర్‌లో 'భజరంగి భాయిజాన్' షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కాగా అక్కడో ప్రాంతంలో షూటింగ్ చేస్తుండగా ఆ ఊరి జనాలు సల్మాన్‌ను చూడ్డానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ తన సినిమాలు చూస్తారా అని అడిగాడట సల్మాన్. తమకు థియేటర్లు అందుబాటులో లేవని.. కాబట్టి సినిమాలు చూడలేమని చెప్పారట. పోనీ టీవీల్లో అయినా నా సినిమాలు చూస్తారా అంటే.. తమకంత ఆర్థిక స్థోమత లేదని చెప్పారట.
దీంతో కరిగిపోయిన సల్మాన్ వాళ్లందరికీ టీవీ సెట్లు కొనిచ్చే బాధ్యత తీసుకున్నాడట. ఇప్పటికే చాలామంది టీవీ సెట్లు అందాయి. ఇంకొంతమందికి అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వార్త తెలిస్తే సల్మాన్ అభిమానులు.. ఇక అతడిపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయమని డిమాండ్ చేస్తారేమో!