అన్ని అనుకూలంగా ఉంటే సినిమా ఇండస్ట్రీలో రాజా బోగా లతో బ్రతకవచ్చు. అవకాశాలు ఉన్నంత వరకే ఇండస్ట్రీలలో అందరు పలకరిస్తారు. లేకుంటే పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఆర్థికంగా ముందే జాగ్రత్త పడకుంటే కూడా ఊహించని పరిణామాలు ఎదురవ్వక తప్పదు. అసలు విషయానికి వస్తే.. అలనాటి అందాల నటి ఇప్పుడు ఎవరు ఊహించని ధీన స్థితిలో ఉంది. ఆమె ఎవరో కాదు సల్మాన్ ఖాన్ తో అప్పట్లో కలిసి నటించిన బాలీవుడ్ హీరోయిన్.
ఆమె పేరు పూజా దడ్వాల్. ఎవరు ఊహించని పరిస్థితే ఆమెకు కూడా ఎదురయ్యింది. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న పూజ సహాయం కోసం ఎదురుచూస్తోంది. కనీసం ఒక టీ కొనుక్కోవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో హిందుస్థాన్’ - ‘సింధూర్ సౌగంధ్’ చిత్రాల్లో నటించిన పూజ దడ్వాల్ 1990ల్లో సల్మాన్ ఖాన్ తో ‘వీర్ ఘటి’ చిత్రంలో నటించింది. అయితే పెద్దగా పాపులర్ కానీ ఈ నటి పెళ్లి చేసుకొని హ్యాపీగా కొన్నేళ్ల వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల క్షయ వ్యాధి రావడంతో మంచాన పడింది.
రీసెంట్ గా మీడియాతో పూజ తన పరిస్థితి గురించి చెప్పుకుంది. నా దగ్గర టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేవ్.. ఆరు నెలల కిందట క్షయ వ్యాధి ఉందని తెలిసింది. ఉన్న డబ్బంతా ఖర్చయింది. గత కొంత కాలంగా సల్మాన్ ని కలవాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికి అవకాశం దొరకలేదు. ఈ విధంగా అయినా ఆయనకు తెలుస్తుందని అనుకుంటున్నా. ఇక నేను 15 రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటున్న. నా భర్త బంధువులు నన్ను పట్టించుకోవడం మానేశారు. ఎవరైనా సహాయం చేస్తే బావుండని పూజ కోరుకుంటోంది.