బాలీవుడ్ ఖాన్ త్రయంలో ముగ్గురికీ హాస్య చతురత కొంచెం ఎక్కువే. సల్మాన్ ఖాన్ ఎప్పుడు మీడియాను కలిసినా వాళ్లతో బాగానే పరాచకాలు ఆడుతుంటాడు. ఫన్నీ కామెంట్స్ చేస్తుంటాడు. బుధవారం తను 52వ పుట్టిన రోజు సందర్భంగా తనను కలిసిన మీడియాతో సల్మాన్ బాగానే తమాషా చేశాడు. ముందుగా తన కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’ అదిరిపోయే వసూళ్లు సాధిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేసిన సల్మాన్.. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా హీరోయిన్ కత్రినా కైఫ్ కే కట్టబెట్టేశాడు. ఆమె వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్టయిందని సల్మాన్ అన్నాడు. మీకు కత్రినా ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ ఏంటి అని సల్మాన్ ను అడిగితే.. ‘‘టైగర్ జిందా హై లాంటి పెద్ద సక్సెస్ ఇచ్చింది. ఇంకేం కావాలి’’ అని బదులివ్వడం విశేషం.
సల్మాన్ పుట్టిన రోజు వేడుకల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో పాటు కత్రినా కైఫ్.. ‘టైగర్ జిందా హై’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్.. అనిల్ కపూర్.. సునీల్ శెట్టి.. సాజిద్ నడియాడ్ వాలా.. ఇంకా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఐతే ఈ వేడుకకు మీడియా వాళ్లను దూరం పెట్టాలని తాను ఎంతగా ప్రయత్నించినా కుదరడం లేదని సల్మాన్ వ్యాఖ్యానించాడు. తాను ఈసారి పుట్టిన రోజుకు ఇండియాలో ఉండబోనని ప్రతిసారీ మీడియా వాళ్లను తప్పుదోవ పట్టిద్దామని చూస్తానని.. కానీ వాళ్లను తన పుట్టిన రోజు వేడుకలకు రానివ్వకుండా చూడటంలో విజయవంతం కాలేకపోతున్నానని.. వాళ్లు తన మీద ప్రేమ చూపిస్తుందన్నందుకు సంతోషమే అని.. కానీ వచ్చే ఏడాది పుట్టిన రోజుకు మాత్రం తాను మీడియాకు దొరకనని అన్నాడు సల్మాన్.