జైలు శిక్ష నుంచి స‌ల్మాన్‌ కి ఊర‌ట‌

Update: 2015-12-10 04:24 GMT
2002 హిట్ అండ్ ర‌న్ కేసు స‌ల్మాన్‌ ఖాన్‌ ని వ‌దిలిపెట్ట‌కుండా వెంట త‌రుముతోంది. చేసిన పాపం వెంటాడుతూనే ఉంటుందంటారు. తాగి చేసినా త‌ప్పు త‌ప్పే. ఆల్క‌హాల్ తాగి ఫుట్‌ పాత్‌ పై నిదురిస్తున్న‌ వారిపైనుంచి కార్‌ ని తోలి వారి మృతికి కార‌కుడ‌య్యాడు. అందుకే ఇంత‌కాలం అత‌డిని కోర్టులు - పోలీస్ కేసులు వెంటాడాయి. ఇప్ప‌టికీ వెంటాడుతూనే ఉన్నాయి.

అయితే ఈ కేసు గురించి ఈరోజు  హైకోర్టులో జ‌డ్జిల ముందు విచార‌ణ జ‌రుగింది. ఇందులో అక్క‌డ ఉన్న ఏకైక సాక్షి స‌ల్మాన్ వ్య‌క్తిగ‌త గార్డ్ .. ఆరోజు డ్యూటీలో ఉన్నా కానిస్టేబుల్ ర‌వీంద్ర పాటిల్ మాత్ర‌మే.  2002లో ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అత‌డు ఇచ్చిన సాక్ష్యాన్ని పోలీసులు రికార్డు చేశారు. అయితే అత‌డు అప్ప‌టికి ఇప్ప‌టికి వెర్ష‌న్ మార్చి చెబుతున్నాడు. వాస్త‌వంగా అప్ప‌ట్లో స‌ల్మాన్ తాగి  డ్రైవ్ చేశాడు అన్న సంగ‌తిని అత‌డు చెప్ప‌లేదు. స‌ల్మాన్ తాగి ఉన్నాడ‌న్న సంగ‌తి వైద్యులు రక్త ప‌రీక్ష చేసి తేల్చారు త‌ప్ప అత‌డు వాంగ్మూలంలో చెప్ప‌నేలేదు. కానీ ఇప్పుడు కోర్టు ముందు ప్ర‌వేశ పెట్టాక పూర్తిగా మాట మార్చి .. అవును స‌ల్మాన్ తాగి డ్రైవ్ చేశాడు. అందుకే త‌ప్పు జ‌రిగింది. రాష్ డ్రైవింగ్ చేయొద్ద‌ని ఎంత వారించినా ఆ రోజు అత‌డు విన‌లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా అప్పుడు తాగ‌లేద‌ని, ఇప్పుడు తాగాడ‌ని అత‌డు మాట మార్చ‌డం వెన‌క మ‌త‌ల‌బు ఉంద‌ని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అత‌డు ఇచ్చిన వాంగ్మూలంతో స‌ల్మాన్ భాయ్‌ కి శిక్ష త‌గ్గుతోంది. ఇది ఎంతో ఊర‌ట క‌లిగించే విష‌య‌మే మ‌రి. ట్ర‌య‌ల్ కోర్ట్ ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. దానిని ఇంకా త‌గ్గించుకునే వీలుంది ఇప్పుడు. అందుకే స‌ల్మాన్ ఊపిరి పీల్చుకుని ఖుషీ అయిపోయాడు.


Tags:    

Similar News