బాలీవుడ్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ - కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కడకు వెళ్లినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న తప్పక ఎదురవుతుంది. సల్లూ భాయ్.... ఏదో ఒక మోడల్ తోనో - హీరోయిన్ తోనో కొన్నాళ్లు డేటింగ్ చేయడం...దీంతో, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు రావడం మామూలే. ఆ తర్వాత, వారిద్దరికీ బ్రేక్ అప్ అవడం....సల్మాన్ ఎప్పటిలాగే `ఏక్ నిరంజన్`గా మిగిలిపోవడం బాలీవుడ్ తో పాటు సల్మాన్ అభిమానులకు అలవాటైపోయింది. ఎప్పటికైనా సల్లూభాయ్ మనసుకు నచ్చిన అమ్మాయి దొరక్కపోతుందా.....వారి పెళ్లిని కళ్లారా చూడకపోతామా అని సల్లూ భాయ్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తన పెళ్లి గురించి తన కన్నా జనాలకే ఎక్కువ తొందరగా ఉందని సల్మాన్ చాలాసార్లు సెటైర్ లు కూడా వేశాడు. తాజాగా - సల్లూ భాయ్....నేడు 52 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సారి పుట్టిన బర్త్ డే పార్టీకి సల్లూ భాయ్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ హాజరవడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లి ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా `హాఫ్ సెంచరీ` దాటేసిన సల్మాన్ జీవితంలో తారసపడ్డ మహిళామణులపై ఓ లుక్కేద్దాం రండి!
ఏ టైంలో ఏ మూడ్ లో ఉంటాడో ...ఎలా ప్రవర్తిస్తాడో తెలియకపోవడం సల్మాన్ వ్యక్తిత్వంలోని ప్రధాన బలహీనత. చాలా విశ్వాస పాత్రంగా - స్నేహంగా - సాత్వికంగా ఉండడం సల్లూ భాయ్ ప్రత్యేకత. ఈ ఈ కారణాల వల్ల సల్మాన్ మిత్రులను - శత్రువులను సంపాదించుకున్నాడు. 1980లో మిస్ ఇండియా గా ఎంపికై బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగీతా బిజ్లానీతో సల్మాన్ ప్రేమాయణం సాగించాడు. సల్మాన్ వేరే అమ్మాయితో చనువుగా ఉండడంతో బిజ్లానీ బ్రేకప్ చెప్పేసిందని రూమర్. ఆ తర్వాత ఎక్కువగా మందు కొడుతున్నాడంటూ సోమీ అలీ టాటా చెప్పిందట. ఇక ఐశ్వర్యా రాయ్ తో సల్మాన్ కహానీ బాలీవుడ్ ను కుదిపేసింది. ఐష్ బ్రేకప్ చెప్పడం తట్టుకోలేని సల్మాన్....`చల్తే చల్తే` సెట్ లోకి వెళ్లి షారుక్ ఖాన్ కాలర్ పట్టుకోవడం సంచలనం రేపింది. వారిద్దరి మధ్య ఏదో ఉందని సల్మాన్ భావించి అలా చేశాడు. ఆ తర్వాత స్నేహా ఉల్లాల్ తో ప్రేమాయణం కూడా బెడిసికొట్టింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ తో బ్రేకప్ అవడం - తామిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరూ స్టేట్ మెంట్లివ్వడం తెలిసిందే. క్లాడియా(బిగ్ బాస్ 3) - జరీన్ ఖాన్ - మాహెక్ చహెల్(బిగ్ బాస్ 5) - డైసీ షా - లూలియా వాంటర్....లు ఆ తర్వాత జాబితాలో ఉన్నారు. అయితే, లూలియాతో కలిసి సల్లూ భాయ్ పార్టీలకు కూడా వెళుతున్నాడని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటిలాగే పుకార్లు వస్తున్నాయి. మరి, ఈ పుకార్లకు సల్లూ భాయ్ ఎపుడు పుల్ స్టాప్ పెడతాడో వేచి చూడాలి.