అప్పుడే ఈమె నన్ను వదిలేసింది : సల్మాన్‌

Update: 2019-05-31 05:12 GMT
సల్మాన్‌ ఖాన్‌ చూడ్డానికి చాలా సీరియస్‌ గా కనిపించినా కూడా తనతో వర్క్‌ చేసే వారిపై కొన్ని సార్లు మీడియా వారిపై పంచ్‌ లు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. అలాగే కొందరి పై ఇండైరెక్ట్‌ గా సెటైర్లు కూడా వేస్తూ ఉంటాడు. ఆమద్య ప్రియాంక చోప్రా తన సినిమాను వదిలేసినందుకు సమయం వచ్చినప్పుడల్లా ఆమెపై ఇండైరెక్ట్‌ గా పంచ్‌ లు వేస్తున్న సల్మాన్‌ ఖాన్‌ తాజాగా కత్రీనాపై కూడా తనదైన శైలిలో పంచ్‌ లు వేస్తున్నాడు.

కత్రీనా కెరీర్‌ ఆరంభంలో సల్మాన్‌ తో ప్రేమ వ్యవహారం సాగించింది. సల్మాన్‌ తో అఫైర్‌ ఆమెకు బాగా కలిసి వచ్చిందని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. అప్పుడు ఏమైందో ఏమో కాని సల్మాన్‌ ను వదిలేసి రణబీర్‌ కపూర్‌ తో వెళ్లి పోయింది. ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్లింది. పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. తనను వదిలేసినా కూడా కత్రీనాతో పాజిటివ్‌ గానే సల్మాన్‌ ఉండే వాడు. ఇటీవలే రణబీర్‌ కపూర్‌ తో కూడా కత్రీనాకు బ్రేకప్‌ అయ్యింది.

సల్మాన్‌ తాజా చిత్రం 'భారత్‌' లో కత్రీనా హీరోయిన్‌ గా నటించింది. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలో సందర్బానుసారంగా కత్రీనాపై పంచ్‌ లు వేస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక టాక్‌ షోలో పాల్గొన్న సల్మాన్‌ మరియు కత్రీనాలు పలు విషయాలపై స్పందించారు. ఆ సమయంలోనే కత్రీనా ఫిట్‌ నెస్‌ గురించి మాట్లాడుతూ నాకు చాలా ఇష్టమైన స్మూతీని 2009లో వదిలేశాను.. అప్పటి నుండి నేను చాలా హెల్తీగా ఉంటున్నాను అంటూ కత్రీనా చెబుతున్న సమయంలో సల్మాన్‌ స్పందిస్తూ అదే సమయంలో నన్ను కూడా వదిలేసింది అంటూ పంచ్‌ వేశాడు.

సల్మాన్‌ మాటకు అంతా గట్టిగా నవ్వేశారు. 2009వ సంవత్సరంలో 'దే ధనా ధన్‌' చిత్రం సమయంలోనే కత్రీనా మరియు సల్మాన్‌ లు బ్రేకప్‌ అయ్యారు. అప్పట్లో ఇద్దరి మద్య ఎలాంటి వ్యవహారం లేదంటూ చెప్పుకొచ్చారు. కాని ఇప్పుడు మాత్రం ఇద్దరం అప్పుడు విడిపోయాం.. అలా విడిపోయాం అంటూ సందర్బానుసారంగా చెబుతున్నారు. సల్మాన్‌ కు మళ్లీ కత్రీనా దగ్గరవుతుందని.. ఇద్దరు మళ్లీ ప్రేమలో పడ్డట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News