పసివాడి ప్రేమకు ఔట్ భాయ్ అవుట్

Update: 2017-05-27 09:55 GMT
సల్మాన్ ఖాన్ ఎప్పుడు తన మాట దురుసుతనం వలనో తను చేసే పనుల వలనో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చాలాసార్లు చూశాం. ఇకపోతే అతను కుటుంబం పై చూపే ప్రేమ వాళ్ళ గురించి ఆలోచించే శైలి మిగతా వారికంటే ఒక డొస్ ఎక్కువగానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి ఎంత వైభవంగా చేశాడో ఆమె సీమంతం కూడా అంతే గ్రాండ్ గా చేశాడు. ఇప్పుడు అతని చెల్లి కొడుకుకు రెండు ఏళ్ళు వచ్చాయి. ఆ పిల్లాడితో సల్మాన్ దిగిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియో.. వైరల్ అవుతోంది.

తన మేనల్లుడు తో దొబుచులు ఆడుతూ ఉండగా షూట్ చేసిన వీడియో.. ఇప్పుడు సల్మాన్‌ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. సల్మాన్ ‘సుల్తాన్‌’ సినిమాలోని పాటలోని లిరిక్..  ‘ఊపర్ అల్లా నీచే ధర్తి బీచ్‌మే తెరా జునూన్‌’ అంటూ పాట పాడుతూ నాతో ఫైట్ చేయిని మేనల్లుడు అహిల్‌ ఖాన్‌ ముందు తెగ మురిపాలు పోయాడు సల్లూ భాయ్. దానికి ఈ పసిపిల్లాడు ఏమో అనుకున్నాడో కానీ పాటకు సరిపడే లా మామ తో ముద్దుముద్దుగా తన బుజ్జి చేతులతో  చెంపలు పై పంచ్ లు ఇచ్చాడు. ఈ ఫైట్లో సల్మాన్ ఖాన్ ఓడిపోయి అల్లుడుని గెలిపించి చూసే వాళ్ళ ప్రేమను పొందాడు.

ఇదే వీడియో లో తన చిన్న తమ్ముడు సొహైల్‌ కూడా ఉన్నాడు. అమ్మాయి ప్రేమలును నిలుపుకోలేక పోయాడు కానీ పిల్ల ప్రేమలను కుటంబ ప్రేమలను బాగానే కూడబేటుకున్నాడు సల్మాన్. అంతే కదూ!!

Full View



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News