మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా భారతాన్ని తెరకెక్కించాలనేది తన కల అని ఈ మధ్యనే చెప్పిన అమీర్ ఖాన్ - ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. రీసెంటుగా ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర కోసం కండలవీరుడు సల్లూభాయ్ ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.
మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. జగన్నాటక సూత్రధారిగా కథ మొత్తం ఆయన చేతుల మీద నడుస్తుంది. అలాంటి పాత్ర సల్లూభాయ్ చేయబోతున్నాడనే రూమన్ ప్రచారం జరగడంతో నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. తమలోని క్రియేటివిటీని చూపిస్తూ కార్టూన్లు కూడా వేస్తున్నారు. అందులో ముఖ్యంగా ‘కురక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి నేను సిద్ధమే. కానీ నేను నా రథసారధిని మార్చుకోవాలనుకుంటున్నాను...’ అంటూ అర్జునుడి వేషంలో ఉన్న అమీర్... కృష్ణావతారంలో ఉన్న సల్లూభాయ్ ని వేడుకుంటున్నట్టు ఉన్న కార్టూన్ నవ్వులు పూయిస్తోంది. సల్లూభాయ్ మీద హిట్ అండ్ రన్ కేసు ఉన్న విషయం తెలిసిందే.
అలాంటి డ్రైవర్ బండి నడుపుతుంటే వెనక కూర్చొని యుద్ధం చేయలేనంటూ అర్జునుడు వేడుకుంటున్నట్టు ఈ కార్టూనిస్టు తన ఉద్దేశ్యాన్ని పెట్టాడు. ఈ కార్టూన్ విషయం పక్కన పెడితే సల్మాన్... కృష్ణుడిగా కంటే భీముడిగా బాగుంటాడని చాలామంది నెటిజన్లు అంటున్నారు. దుర్యోదనుడైతే సరిగ్గా సరిపోతాడని మరికొందరు అనుకుంటున్నారు. రెండూ నిజమే కదా!