భాయ్ టైమ్ చూసి బోనీకి ఝ‌ల‌క్ ఇచ్చాడా?

Update: 2022-10-29 04:02 GMT
స‌ల్మాన్ భాయ్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ మాజీ భార్య మ‌లైకా అరోరాఖాన్ తో వివాహేత‌ర సంబంధం కార‌ణంగా కుర్ర హీరో అర్జున్ క‌పూర్ పేరు ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో వినిపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. నిజానికి మ‌లైకా భ‌ర్త నుంచి విడిపోక ముందే అర్జున్ తో డేటింగ్ ప్రారంభించ‌డంతో స‌ల్మాన్ కుటుంబంతో అతడి తండ్రి గారైన నిర్మాత‌ బోనీక‌పూర్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయ‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది. త‌న‌యుడు అర్జున్ క‌పూర్ చేసిన ప‌ని త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. దీనివల్ల స‌ల్మాన్ తో త‌న రిలేష‌న్ షిప్ తీవ్రంగా దెబ్బ తింద‌ని బోనీ బ‌హిరంగంగానే వాపోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇదంతా తెలిసిన క‌థే అనుకుంటే ఇప్పుడు నెమ్మ‌దిగా ఆ ఇరు కుటుంబాల మ‌ధ్యా సాన్నిహిత్యంలో ట్ర‌బుల్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకునేందుకు తాజా స‌న్నివేశం ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. నిజానికి బోనీక‌పూర్ నిర్మించిన ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో స‌ల్మాన్ న‌టించారు.

అందులో నో ఎంట్రీ ఒకటి. ఈ ఫ్రాంఛైజీ నుంచి మోస్ట్ అవైటెడ్  సీక్వెల్ కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ఝ‌ల‌క్ త‌గిలింది. ప్రాజెక్ట్ నుంచి సల్మాన్ ఖాన్ తప్పుకోవ‌డం బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే...

సల్మాన్ ఖాన్ నటించిన కామెడీ యాక్ష‌న్ డ్రామా 'నో ఎంట్రీ' 2005లో రిలీజై బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్ ప‌నులు ప్ర‌స్తుతం సాగుతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. అయితే క్రియేటివ్‌ టీమ్ తో విభేదాల కారణంగా సల్మాన్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మ్‌ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

అతను తన స్థానంలో ఎవరినైనా కనుగొనమని బోనీ కపూర్ ని కోరాడు. ప్రాజెక్ట్ నుండి గౌరవప్రదంగా నిష్క్రమించాడు. అనీస్ బజ్మి దర్శకత్వం వహించే ఈ సీక్వెల్ లో అనిల్ కపూర్ - ఫర్దీన్ ఖాన్ కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. బోనీ కపూర్ దీనిని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించనున్నారు.

అయితే స‌ల్మాన్ అనూహ్యంగా ఈ మూవీ నుంచి త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానాన్ని ఎవ‌రితో భ‌ర్తీ చేయ‌గ‌ల‌రు? అన్నది ప్ర‌ధానంగా చ‌ర్చగా మారింది. బోనీ సుపుత్రుడు చేసిన ప‌నికి అస‌హ‌నంతో ఉన్న స‌ల్మాన్ భాయ్ కావాల‌నే ఇలా ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడ‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. కార‌ణం ఏదైనా మ‌లైకాతో అర్జున్ ఎఫైర్ తెచ్చిన ముప్పు ఇద‌ని ప్రూవైంది! అంటూ ఒక సెక్ష‌న్ నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. భాయ్ టైమ్ చూసి బోనీకి ఝ‌ల‌క్ ఇచ్చాడ‌నేది వారి వాద‌న‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News