స్నేహం కోసం సాయానికి ముందుకు రావడం సినీపరిశ్రమల్లో రెగ్యులర్ గా చూసేదే. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా-నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ పారితోషికం తీసుకోలేదని కథనాలొచ్చాయి. సైరా నిర్మాత రామ్ చరణ్ హిందీ మెగాస్టార్ కోసం భారీ పారితోషికం ఇవ్వజూసారని కానీ ఆయన తన స్నేహితుడు చిరంజీవి కోసం నటించానని చెప్పడంతో అందరూ స్టన్ అయ్యారని వార్తలొచ్చాయి.
ఇప్పుడు అలాంటి సన్నివేశమే సల్మాన్ భాయ్ రిపీట్ చేశారు. షారుఖ్ ఖాన్ `పఠాన్`లో సల్మాన్ ఖాన్ తన అతిధి పాత్ర కోసం డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. పఠాన్ లో తన 10 రోజుల అతిధి పాత్రకు నిర్మాత ఆదిత్య చోప్రా సల్మాన్ ఖాన్ కు భారీ పారితోషికం చెల్లించనున్నట్లు కథనాలొచ్చాయి. పఠాన్ లో కొన్ని సన్నివేశాల్లో కనిపించే అతిథి పాత్రలో సల్మాన్ నటించారు. ఆ పాత్ర సినిమా విలువను పెంచి బాక్సాఫీస్ వద్ద వసూళ్లకు పెద్ద సాయమవుతుందని భావిస్తున్నారు. అందువల్ల దాని కోసం పారితోషికం చెల్లించాల్సిన అవసరం ఉందని చిత్రనిర్మాత అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో సల్మాన్ ఖాన్ ముంబైలోని వైఆర్.ఎఫ్ స్టూడియోలో షారూఖ్ ఖాన్ తో కలిసి తన పార్ట్ చిత్రీకరణను పూర్తి చేశారు సల్మాన్. షూట్ పూర్తయినతరువాత వేతనం చెల్లింపుల కోసం నిర్మాత సల్మాన్ వద్దకు వెళ్ళారట. కానీ సల్మాన్ డబ్బు తీసుకోవడానికి వెంటనే నిరాకరించాడు.
షారూఖ్ ఒక సోదరుడిలాంటివాడు. నేను అతని కోసం ఏదైనా చేస్తాను!! అని సల్మాన్ అన్నారట. కానీ నిర్మాత ఆదిత్యా చోప్రా పూర్తి ప్రొఫెషనల్ కావడంతో పారితోషికం అందాల్సిందేనని పట్టుబట్టారట. అయితే తనకు ఇవ్వాలనుకున్న పారితోషికాన్ని యష్ రాజ్ సంస్థ నిర్మించే టైగర్ బడ్జెట్లో చేర్చాల్సిందిగా సల్మాన్ కోరారట. ఆదిత్య చోప్రా ఈ సందర్భం గురించి షారూఖ్ కి చెప్పినప్పుడు అతడేమీ ఆశ్చర్యపోలేదు.``భాయ్ తో భాయ్ హై`` అని అన్నారట. ప్రస్తుతం మహమ్మారి కారణంగా మహారాష్ట్ర జారీ చేసిన ఉత్తర్వుల అనంతరం పఠాన్ - టైగర్ రెండింటి షూటింగులు ప్రస్తుతానికి ఆపేశారు.