తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన జెనీలియా మరియు బాలీవుడ్ తో పాటు ఆల్ ఓవర్ ఇండియా సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్ కలిసి డాన్స్ వేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జెనీలియా ఎంతో మంది హీరోలతో కలిసి స్టెప్పులు వేసింది. కాని అది హీరోయిన్ గా చేసే సమయంలో... కాని ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్ గా సినిమా లు చేయడం లేదు.. అప్పుడప్పుడు భర్త రితేష్ తో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె రీల్స్ చేయడం.. తానే ఒంటరిగా వీడియోలు చేయడం చేస్తుంది. కాని జెనీలియా ఈసారి సల్మాన్ ఖాన్ తో వేసిన ఒక డాన్స్ బిట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సల్మాన్ ఖాన్ మరియు జెనీలియాలు తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సరదాగా ఇలా డాన్స్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో డ్రస్ కోడ్ ఉండటంతో ఇద్దరు కూడా మెరూన్ కలర్ టీ షర్ట్ లను ధరించడం జరిగింది. సల్మాన్ ఖాన్ మరియు జెనీలియాల డాన్స్ వీడియో ను సోషల్ మీడియాలో ఫిల్మ్ ఫేర్ అఫిషియల్ అకౌంట్ లో షేర్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా చాలా జోష్ తో అలసి పోకుండా స్పీడ్ గా స్టెప్పులు వేస్తూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఇద్దరి డాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా జోష్ తో కేకలు వేస్తూ జెనీలియా డాన్స్ వేయడం చూసిన అభిమానులు ఆమె ఎనర్జీకి ఫిదా అవుతున్నారు.
ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి.. వయసు ఎక్కవ అయినా కూడా ఇంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేయడం నిజంగా చాలా పెద్ద విషయం అన్నట్లుగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే ఈ వీడియోను నెట్టింట అన్ని వర్గాల వారు షేర్ చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే కొందరు ఈ వీడియోకు బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు. జెనీలియా తీరును తప్పుబడుతున్నారు. ఇద్దరు పిల్లల తల్లి మీరు.. సమాజంలో గౌరవం ఉన్న ఒక కుటుంబంకు కోడలు.. మీరు ఇలా చేయడం ఏంటీ అంటూ విమర్శించే వారు కూడా లేక పోలేదు. కాని ఇక్కడ ఆమె చేసిన తప్పు ఏమీ లేదు. కనుక ఆమె ను ఈ విషయంలో నింధించాల్సిన అవసరం లేదు అనేది కొందరి వాదన.