స‌ల్మాన్ (X) KRK ..ఇద్ద‌రు హీరోల్ని గొడ‌వ‌లోకి లాగాడు!

Update: 2021-06-06 12:30 GMT
స‌ల్మాన్ వ‌ర్సెస్ కేఆర్కే వివాదం ముదిరి అగ్గి రాజుకుంటున్న సంగ‌తి తెలిసిందే. రాధే చిత్రానికి రివ్యూ రాస్తూ త‌న‌ని కించ‌ప‌రిచే విధంగా కామెంట్ చేశాడ‌ని స‌ల్మాన్ బృందాలు కోర్టుకు వెళ్లాయి. అత‌డు గ‌తంలోనూ ప‌లువురు స్టార్ల‌పై దుర్భాష‌లాడిన చ‌రిత్ర క‌లిగి ఉన్నాడ‌ని అందుకే ఈసారి స‌ల్మాన్ దీనిని సీరియ‌స్ గా తీసుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఈ వివాదం ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో న‌లుగుతోంది. ఈలోగానే కేఆర్కే  ఓ ఇద్ద‌రు బాలీవుడ్ ప్ర‌ముఖ హీరోల్ని వివాదంలోకి లాగారు. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు సీనియ‌ర్ హీరో గోవిందా అయితే.. మ‌రొక‌రు యువ‌హీరో అర్జున్ క‌పూర్. ఆ ఇద్ద‌రూ త‌న‌కు స‌ల్మాన్ విష‌యంలో మ‌ద్ధ‌తుగా నిలిచార‌ని ఒక వాద‌న‌ను తెర‌పైకి తెచ్చిన అత‌డు ఆ త‌ర్వాత మాట మార్చ‌డంతో నెటిజ‌నుల్లో ట్రోల్స్ తీవ్ర‌త‌రం అయ్యాయి.

యంగ్ హీరో అర్జున్ క‌పూర్ త‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచి నిజ‌మైన స్నేహితుడ‌య్యాడ‌ని అత‌డు సల్మాన్ ఖాన్ కి అస్స‌లు భ‌య‌ప‌డ‌డం లేద‌ని వ్యాఖ్యానించాడు. ఇక‌పై అర్జున్ సినిమాల‌పై రివ్యూలు అస్స‌లు రాయ‌న‌ని కూడా ఆఫ‌ర్ చేశాడు. అయితే అస‌లు అర్జున్ క‌పూర్ అత‌డికి మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ట్టు ఎక్క‌డా ప్రూఫ్ లేదు. దానిని అత‌డు నిరూపించాల్సి ఉందంటూ ట్రోల్స్ ప‌రాకాష్ట‌కు చేరాయి. అర్జున్ ని కావాల‌నే వివాదంలోకి లాగాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

మ‌రోవైపు సీనియ‌ర్ న‌టుడు గోవిందాకు స‌ల్మాన్ కు మ‌ధ్య ఉన్న వ్య‌క్తిగ‌త గొడ‌వ‌ల్ని కూడా అత‌డు కెలికాడు. గోవిందా త‌న‌కు మ‌ద్ధ‌తునిచ్చిన‌ట్టు త‌నకు తాను రాసుకున్నా.. ఆ త‌ర్వాత గోవిందా దానిని సూటింగా ఖండించ‌డంతో క్లియ‌ర్ అయ్యింది. గోవిందానే ఎదురు తిర‌గ‌డంతో కేఆర్కే అది హీరో గోవిందా కాద‌ని అత‌డు త‌న స్నేహితుడు గోవిందా అంటూ మాట మార్చాడు. నటుడు కం సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేని స‌ల్మాన్ విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేర‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వండి వారుస్తోంది.

సల్మాన్ రాధే విడుదలైన తరువాత కెఆర్కెపై పరువు నష్టం కేసు పెట్టారు. ఈ చిత్రంపై తన సమీక్షకు ఈ దావా అని KRK పేర్కొన్నప్పటికీ సల్మాన్ న్యాయ బృందం పరువు నష్టం కేసు పూర్తిగా వ్యక్తిగత దాడులకు సంబంధించినదని ప్రకటించింది. ముఖ్యంగా స‌ల్మాన్ కి చెందిన ఎన్జీవో `బీయింగ్ హ్యూమన్` గురించి కేఆర్కే చేసిన వ్యాఖ్యలపై ఈ దావా వేసారు. మిస్టర్ సల్మాన్ ఖాన్ అవినీతిపరుడు.. అతను అతని బ్రాండ్ బీయింగ్ హ్యూమన్ మోసం.. అంతా తారుమారు .. డబ్బు కోసం ఇదంతా! అంటూ వ్యాఖ్యానించ‌డంతో దానిపై స‌ల్మాన్ దావా వేశారు. మ‌నీ లాండరింగ్ లావాదేవీలకు స‌ల్మాన్ తో పాటు సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ డకోయిట్స్ అని వ్యాఖ్యానించడం ఈ కోపానికి కార‌ణ‌మ‌ని తెలిసింది.
Tags:    

Similar News