న‌టికి ఆప‌రేషన్ చేయించిన స‌మంత‌

Update: 2021-11-10 05:39 GMT
అందాల క‌థానాయిక స‌మంత మంచి మ‌న‌సు గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి ఇప్ప‌టికే కొంత‌ తెలుసు. తెలియ‌నిది చాలా ఉంది. ప్ర‌త్యూష ఫౌండేష‌న్ ని స్థాపించిన త‌న సంపాదన నుంచి కొంత‌ వ‌ర‌కూ సేవా కార్య‌క్ర‌మాల‌కే స‌మంత ఖ‌ర్చు చేస్తోంది. ఆప‌ద‌లో ఉన్నాన‌ని కోరే పేద‌లు పిల్ల‌లు బాలిక‌ల‌కు త‌నవంతు సాయం చేస్తోంది. విక‌లాంగులు స‌హా పేద బాలిక‌ల చ‌దువుల కోసం స‌మంత చేయ‌ని సాయం లేదు. ఒకానొక సంద‌ర్భంలో సమంత‌ను చూసి ఇత‌రులు చాలా నేర్చుకోవాల‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ అంత‌టి వారే ప్ర‌శంస‌లు కురిపించారు. క‌థానాయిక‌గా కెరీర్ ఆరంభం నుంచే సేవా గుణం ప్ర‌ద‌ర్శించిన స‌మంత ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రుల‌కు త‌న వ్య‌క్తిగ‌త సేవికులు ప‌ని వారికి కూడా ఎంతో సాయం చేశార‌ని క‌థ‌నాలు వినిపిస్తుంటాయి.

ఇక‌పోతే చేసిన మేలును మరువ‌కూడ‌ద‌ని భావించారో ఏమో కానీ సాటి న‌టీమ‌ణి తేజ‌స్వి మాదివాడ ఇప్పుడు ఓ సంగ‌తిని చెప్పి హృద‌యాల్ని ద్ర‌వింప‌జేసారు. అంత‌గా స‌మంత ఆమె కు చేసిన సాయం ఏమిటీ? అన్న‌ది ఆరా తీస్తే.. తేజ‌స్వి మాదివాడ గ్లామ‌ర్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్ట‌క ముందే ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించింది. త‌ల్లి చిన్న‌ప్పుడే మ‌ర‌ణించ‌గా తండ్రి తాగుబోతు అయ్యి త‌న‌ని పోషించ‌లేక‌పోయారు. ఆ క్ర‌మంలోనే ఒంట‌రి అయిన తేజ‌స్వి జీవితంలో ఎంతో ఎమోష‌న్ దాగి ఉంది. హాస్ట‌ళ్ల‌లో ఉండి చ‌దువుకోవ‌డం కాలేజ్ క్యాంప‌స్ లో గ‌డిపేయ‌డం వ‌గైరా వ‌గైరా ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఇక ఈ తెలుగ‌మ్మాయి ఇండ‌స్ట్రీలో అడుగ‌పెట్ట‌గానే తానేమీ పెద్ద స్టార్ అయిపోలేదు. ఆర్జించేది తిండి కి మెయింటెనెన్స్ కే స‌రిపోయేది. ఆ క్ర‌మంలోనే త‌న‌కు కొన్నేళ్ల క్రింద‌ట టీబీ రావడంతో ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని డాక్ట‌ర్ అన్నార‌ట‌. కానీ త‌న‌వ‌ద్ద డబ్బు లేదు. అప్పుడు తేజ‌స్వికి పెద్ద మ‌న‌సుతో సాయం చేసింది స‌మంత‌నే. కానీ ఆ సాయం గురించి ఇన్నాళ్లు బ‌య‌టికి తెలిసింది లేదు. ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో స‌మంత మంచిత‌నం గురించి సేవాగుణం గురించి తేజస్వి వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆ నోటా ఈనోటా ఈ సాయం గురించి జ‌నం తెలుసుకుంటున్నారు. సామ్ చేసిన సాయాలు ఇలాంటివి ఎన్నో. కానీ వాటికి ప్ర‌చారం కోరుకోలేదు. అంత మంచి మ‌నసు ఉంది కాబ‌ట్టే ఇండ‌స్ట్రీలో గొప్ప స‌త్సంబంధాల‌ను స‌మంత క‌లిగి ఉన్నారు. ఇక సంసార‌ జీవితంలో నాగ‌చైత‌న్య‌తో క‌ల‌త‌లు రావ‌డం అనేది త‌న దుర‌దృష్టం. విభేధాల వ‌ల్ల విడిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. చైత‌న్య‌- స‌మంత విడాకుల గురించి ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌ను క‌లచివేసిన సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News