చై-సామ్ ప్రేమ పెళ్లి మ‌ధురాతిమ‌ధురం

Update: 2020-02-21 07:30 GMT
ప్రేమ‌లో ప‌డ‌డం.. ఆ త‌ర్వాత క‌లిసి జంట షికార్లు.. ఇంకాస్త ముందుకెళ్లి పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లితో ఒక‌ట‌వ్వ‌డం.. అటుపై వేరు కాపురం .. కెరీర్ అంటూ షెడ్యూల్స్ వేసుకోవ‌డం.. ఇదంతా లైఫ్ జ‌ర్నీ. ఈ జ‌ర్నీలో చై-సామ్ జోడీ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టు? అంటే చాలా దూర‌మే వ‌చ్చేశారు.

అక్కినేని నాగ చైతన్య - స‌మంత జంట `ఏమాయ చేశావే` (2010) షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత చాలా కాలం ప్రేమాయణం సాగింది. క‌లిసి షికార్లు చేశారు. అటుపై ఇరువైపులా పెద్ద‌ల్ని ఒప్పించి 2017 లో పెళ్లాడుకున్నారు. గోవాలో ఈ జంట డెస్టినేష‌న్ వెడ్డింగ్ ని అభిమానులు మ‌రువ‌లేరింకా. హిందూ సంప్రదాయం.. క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయం ప్రకారం రెండు వివాహాల గురించి తెలిసిందే. అక్టోబర్ 6 .. అక్టోబ‌ర్ 7 తేదీల్లో సెల‌బ్రేష‌న్ సాగింది. కొన్నేళ్లుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరవాత ఆ జ‌ర్నీలో ఎన్నో రివ‌ల్యూష‌న్స్ బ‌య‌ట‌ప‌డ్డాయి. అందుకే ఆ మెమ‌రీస్ ని ప్ర‌తిసారీ సామ్- చై జోడీ గుర్తు చేసుకుంటూనే ఉంటుంది.

అప్ప‌ట్లోనే చై - సామ్ పెళ్లి వీడియో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్ర‌ఖ్యాత జోసెఫ్ రాదిక్ షూట్ చేసిన వివాహ వీడియోలో అందమైన గ్లింప్స్ మ‌ర్చిపోలేనివి. చైతూ ల‌వ్ ఎఫెక్ష‌న్.. మండపం లోకి అడుగు పెట్టడానికి ముందు చైత‌న్య‌ వధువు స‌మంత‌ను చూడటం.. వధువుగా సమంతా మొదటి క్షణాలు.. ఆపై క్రిస్టియ‌న్ స్టైల్ వెడ్డింగ్ ప్రిప‌రేష‌న్ వ‌గైరా.. ఆ వీడియో లో ఆక‌ట్టుకున్నాయి.

ఓ మూవీ ప్రమోషనల్ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ చైతన్య ను ఎప్పుడు సమంతకు ప్రపోజ్ చేశారు అని అడిగితే.. ``దాదాపు 10 సంవత్సరాల క్రితం.. ఏ మాయ చెసావే షూటింగులో కలుసుకున్నాం. గత ఏడు సంవత్సరాలుగా సమంతను ఆకట్టుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఆమెను వివాహం చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు`` అని సమాధానం ఇచ్చాడు. అంటే ఆ ప్రేమ‌కు తొలి నాళ్ల‌లోనే ముడి ప‌డింద‌ని అర్థ‌మైంది ఆక్ష‌ణం.
Tags:    

Similar News