స‌మంత అమెరికా ట్రిప్ ఫ్యాన్స్ లో గంద‌ర‌గోళం!

Update: 2022-09-22 13:30 GMT
నాగ చైత‌న్య‌తో విడిపోయిన త‌ర్వాత స‌మంత కోలుకుని మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడింకా రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తుంది. టాలీవుడ్ ని విడిచిపెట్ట‌కుండా బాలీవుడ్ లో బిజీ అవుతోంది. అయినా స‌మంత‌-నాగ‌చైత‌న్య మ‌ధ్య  మీడియా క‌థ‌నాలు ఎప్ప‌టిక‌ప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారుతునే ఉన్నాయి.

విడిపోయి వాళ్లిద్ద‌రు సంతోషంగా ఉన్నా..ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అయినా అక్క‌డో..ఇక్క‌డో..ఎక్క‌డ ఓ చోట ఈ బ్రేక‌ప్ వార్త ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంది. స‌మంత తండ్రి నుంచి..నాగ‌చైత‌న్య తండ్రి నుంచి క్లియ‌ర్ క‌ట్ స‌మాధానం వ‌చ్చినా క‌థ‌ల‌నాల‌కి మాత్రం పుల్ స్టాప్ ప‌డ‌లేదు. ఇది స‌హ‌జ‌మైన చర్యే. అయితే సామ్ కొద్ది రోజులుగా షూటింగ్ ల‌కు బ్రేక్ ఇచ్చింది.

అలాగే  సోష‌ల్ మీడియాలోనూ క‌నిపించ‌లేదు. అయితే స‌మంత అమెరికా ట్రిప్ వెళ్లిన‌ట్లు ఇప్ప‌టికే వార్త‌లొచ్చాయి. దీంతో కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవ‌డం కోస‌మే యూఎస్ వెళ్లింద‌ని అంతా అనుకుంటున్నారు. అయితే అస‌లు సంగ‌తి అది కాదు..ఇది అంటూ కొత్త త‌ర‌హా ప్ర‌చారం మొద‌లైంది.

స‌మంత రెస్ట్ కోసం వెళ్ల‌లేదు ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లిందంటూ కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తుంది. ఈ వార్త‌ల్ని ఇంత‌వ‌ర‌కూ స‌మంత ఖండించ‌లేదు. అటు సామ్ మేనేజ‌ర్ మాత్రం  అస‌లు విష‌యం చెప్ప‌కుండా నెట్టింట జ‌రిగే ప్రచారాన్ని ఖండించారు. స‌మంత చ‌ర్మ స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతతోంద‌ని..దానికి సంబంధించిన స‌ర్జ‌రీ కోసం అమెరికా వెళ్లింద‌ని అభిమానుల్లో చ‌ర్చ‌కొస్తుం ది.

అలాగే  మ‌రికొంత మంది సామ్ ఫిట్ నెస్ ప‌రంగా శ‌రీరంలో తీసుకొచ్చిన మార్పుల‌తో ఆరోగ్య ప‌రంగా  కొన్ని ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంద‌ని..ఆ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకోవ‌డం కోస‌మే   ఉన్న ప‌ళంగా అమెరికా ప్లైట్ ఎక్కింద‌ని అంటున్నారు. మొత్తానికి అభిమానుల్లో ఈ రెండు  కార‌ణాల‌తో గంద‌ర‌గోళం క‌నిపిస్తుంది.

పైగా స‌మంత ఇంత వ‌ర‌కూ అమెరికా వెళ్లిన నాటి నుంచి ఒక్క అప్ డేటే్ ఇవ్వ‌లేదు. వెకేష‌న్ ట్రిప్ అయితే ఇన్ స్టాలో ఫోటోలైనా?  పెట్టేదిగా? మ‌రి అదెందుకు జ‌ర‌గ‌లేదు?  సామ్ మేనేజ‌ర్  ఏ కార‌ణంతో మాట దాట వేస్తున్నారంటూ? సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. వీట‌న్నింటికి తెర ప‌డాలంటే స‌మంత సీన్ లోకి రావాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News