24తో లింకులు పెరుగుతున్నాయ్

Update: 2016-01-19 05:07 GMT
కో ఇన్సిడెంట్ అని అంటూ ఉంటాం. కానీ ఒకేసారి ఒకే రకంగా వేరు వేరు వ్యక్తులకు అదే కో ఇన్సిడెంట్ ఎదురుకావడమంటే విచిత్రమే. అలా లింకులు కలవడం చాలా అంటే చాలా కో ఇన్సిడెంటల్ అనాల్సిందే. ఇప్పుడు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ - సౌత్ బ్యూటీ సమంతల పరిస్థితి ఇదే.

ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి పని చేయబోతోంది 24 అనే సినిమాకి. సూర్య హీరోగా మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ టైటిల్ కి, రెహమాన్ కి ఓ లింక్ ఏర్పడింది. ఈ మ్యూజిక్ మాంత్రికుడు సినీ రంగ ప్రవేశం చేసి ఇది 24వ సంవత్సరం కావడం విశేషం. కెరీర్ లో తన 24 వ ఏట.. 24 అనే సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు రెహమాన్. ఇక సమంతకు కూడా ఈ 24తో రిలేషన్ ఒకటి లింక్ అయింది.

గెస్ట్ కేరక్టర్లు - కేమియోలు మినహాయిస్తే, హీరోయిన్ గా సమంతకు.. 24 మూవీ ఇరవైనాలుగవదే. ఏం మాయ చేశావే తో ప్రారంభించి, సౌత్ అంతా సత్తా చాటుతున్న శామ్స్.. ఇప్పుడు హీరోయిన్ గా 24వ సినిమా చేస్తోంది. అది కూడా 24 అనే టైటిల్ తో రూపొందుతున్న సినిమాలోనే. అలా ఈ 24 టైటిల్ తో.. చిత్ర యూనిట్ కి లింకులు పెరుగుతున్నాయి. అసలు టైటిల్ లో ఉన్న 24 అంటే.. 24 గంటలు అని అర్ధం లెండి.
Tags:    

Similar News