యంగ్ హీరోతో స‌మంత రొమాన్స్!

Update: 2022-03-04 09:30 GMT
స‌మంత కెరీర్ మ‌ళ్లీ ఊపందుకున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత సామ్ వేగం మ‌రింత పుంజుకుంది. డివోర్స్ అనంత‌రం `పుష్ప` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ అంటూ ` యువ‌త‌ని ఓ ఊపు ఊపేసింది. ఈ ఒక్క పాట‌తో స‌మంత మ‌ళ్లీ యువ‌త దృష్టిని ఆక‌ర్షించింది. పెళ్లైన హీరోయిన్ అనే ముద్ర‌ని ఈ పాట‌తో చెరుపుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనూ స‌మంత దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రీక‌ర‌ణ పూర్తిచేసింది. త్వ‌రలో ఆ సినిమా రిలీజ్ కానుంద‌. శాకుంత‌లంతో స‌మంత‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కుతుంద‌ని అంచ‌నాలున్నాయి.

ఇక `య‌శోద` అనే మ‌రో థ్రిల్ల‌ర్ సామ్ మెయిన్ లీడ్ లో తెలుగు..త‌మిళ్ లో తెర‌కెక్కుతోంది. ఇలా ఓవైపు ఉమెన్ సింట్రిక్ చిత్రాల‌తో దూసుకుపోతూనే మ‌రోవైపు సోలో హీరోయిన్ గాను  స‌మంత స‌త్తా చాటుతోంది. అగ్ర హీరో స‌ర‌స‌న వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని  విడిచిపెట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌లో ద‌శ‌లో  ఉన్నాయి. తాజాగా స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త ప్రాజెక్ట్లోనూ అవ‌కాశం అందుకున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

విజ‌య్ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ప‌లువురి భామ‌ల పేర్లు ప‌రిశీల‌న అనంత‌రం బాలీవుడ్ న‌టి కియారా అద్వాణీని ఎంపిక  చేసారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని స‌మాచారం.  మ‌రోవైపు పూరి జ‌గ‌న్నాధ్ `జ‌న‌గ‌ణ‌మ‌న` చిత్రంలో విజ‌య్ న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం లోకేష‌న్ల వేట సాగుతోంది. ఏప్రిల్ లో చిత్రం సెట్స్ పైకి వెళ్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇవేవి ఇంకా అధికారికం కాదు.

ఈ నేప‌థ్యంలో ఈ రెండు సినిమాల గ్యాప్ లో విజ‌య్  ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. అందులో హీరోయిన్ గా స‌మంత‌ని ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి  వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే రిలీజ్ అవుతాయ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో తేలాలి. శివ నిర్వాణ‌..పూరి లాంటి స్టార్లు మేక‌ర్లు లైన్ లో ఉండ‌గా  కొత్త‌గా ఈప్రాజెక్ట్ తెర‌పైకి రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం. అదే  నిజ‌మైతే స‌మంత తెరని పంచుకోవ‌డం  విజ‌య్ కి రెండ‌వ సారి అవుతుంద‌.  గ‌తంలో `మ‌హాన‌టి` చిత్రంలో క్యామియో పాత్ర‌ల్లో న‌టించారు. అవి కేవ‌లం అతిధి పాత్ర‌లే. కాంబినేష‌న్ నిజ‌మే అయితే  స‌మంత‌-విజ‌య్ మ‌ధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది.
Tags:    

Similar News