సమంత మరో బ్రాండ్‌ వేసేసుకొంది

Update: 2015-03-19 04:39 GMT
ఒక్కసారి స్టార్‌ అనిపించుకొంటే చాలు... ఇక తిరుగే ఉండదు. సినిమాల్లో క్రేజీ క్రేజీ అవకాశాలన్నీ కూర్చున్న చోటకే వచ్చేస్తుంటాయి. బయట నుంచి కూడా మా ప్రొడక్ట్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడంటూ వ్యాపారావకాశాలు వస్తుంటాయి. అంటే...  రెండు చేతులా ఎడాపెడా సంపాదించేయొచ్చన్నమాట. ఇప్పుడు సమంత అదే చేస్తోంది.

     ఇటు సినిమాలు, అటు బ్రాండ్లూ... సమంతకి వద్దంటే అవకాశాలిచ్చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో డజనుకిపైగా బ్రాండ్లకి ఆమె అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా మరో బ్రాండ్‌ కూడా చేరింది. నేను ఇక నుంచి హమామ్‌ గర్ల్‌ని అంటూ ఆమె తాజాగా ప్రకటించింది. హమామ్‌ సోప్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేస్తున్నందన్న మాట. హమామ్‌ ఆఫర్‌తో మా అమ్మ ఎంతగానో గర్వపడుతుందని సమంత చెప్పుకొచ్చింది. ఆ సోప్‌తో చిన్ననాటి జ్జాపకాలు ఎన్నో ఉన్నాయని ఆమె సెలవిచ్చింది.
Tags:    

Similar News