అక్కినేని నాగచైతన్య.. సమంత జంట విభేధాలు.. విడాకుల వ్యవహారంపై గత కొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అవి తారా స్థాయికి చేరుకున్నాయి. ఎంత క్లారిటీ ఇచ్చినా ఈ పుకార్లకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. తమపై వస్తున్న పుకార్లపై స్పష్టమైన వివరణను ఇప్పటి వరకు నాగచైతన్య.. సమంత ఇవ్వలేదు.. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు కూడా. దీంతో వీరి విడాకులపై వస్తున్న వార్తలు ఆగడం లేదు.
సామ్ తాజాగా దీనిపై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అభిమానులతో ప్రత్యేకంగా సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన సమంత తన విడాకుల రూమర్ లపై క్లారిటీ ఇచ్చినట్టే ఇచ్చారు... గత కొంత కాలంగా ఈ వార్తలపై సైలెంట్ గా వుంటున్న సమంత తాజాగా మౌనం వీడింది. తను గత ఏడాది కొత్తగా ప్రారంభించిన గార్మెంట్ బ్రాండ్ సాకీ ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమంత ఇన్ స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ ని నిర్వహించారు. ఈ సమయంలో ఓ అభిమాని `మీరు నిజంగా ముంబై వెళ్లిపోతున్నారా? అని ప్రశ్నించాడు.
దీనికి సమంత స్పష్టంగా సమాధానం చెప్పింది. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చారు. `ఈ పుకారు ఎక్కడ మొదలైందో నాకు నిజంగా తెలియదు కానీ వందలాది పుకార్ల లా ఇది నిజం కాదు. హైదరాబాద్ నా ఇల్లు ఎప్పటికీ నా ఇళ్లే. హైదరాబాద్ నాకు అన్నీ ఇచ్చింది.. ఇస్తోంది. నేను ఎప్పటికీ ఇక్కడే నివసిస్తాను` అని సమంత అభిమాని ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ జ్యోతిష్కుడు నాగచైతన్య.. సమంత విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించాడు. అంతే కాకుండా నాగచైతన్య కెరీర్ మరో లెవెల్ కి చేరుతుందని.. తను స్టార్ లా వెలిగిపోతాడని.. అయితే సమంత మాత్రం పతనావస్థకు చేరుకుంటుందని...ముంబైకి తను మాకాం మార్చవచ్చని తెలిపాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఈ పుకార్లు అక్కినేని అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చై.. సామ్ నిజంగానే విడిపోతున్నారా? ..జ్యోతిష్కుడి జోష్యం నిజం కాబోతోందా? అని అభిమానులు గత కొన్ని రోజులుగా కలవపాటుకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా విడాకుల గురించి చాలా మంది అభిమానులు సమంతని నేరుగా ప్రశ్నించినా వాటన్నింటినీ పట్టించుకోని సమంత అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం అన్నట్టుగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నని ఎంచుకుని దాంతో రూమర్ లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది కానీ విడాకులపై మాత్రం స్పష్టతనివ్వలేదు. తాను హైదరాబాద్ వీడి ఎక్కడికీ వెళ్లనని చెప్పిన సామ్ అదే తరహాలో తాను నాగచైతన్యని వీడనని మాత్రం చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం.
విడాకుల పుకార్లపై ఇప్పటి వరకు నాగచైతన్య.. సమంత సమాధానం డైరెక్ట్ గా చెప్పకుండా వేరే సాకులు చెబుతూ తప్పుకుని తిరుగుతున్నారు. అయితే వచ్చే నెల అంటే అక్టోబర్ 7న వీరి మ్యారేజ్ డే రాబోతోంది. ఆరోజున విడాకుల పుకార్లపై ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన అంటే క్లారిటీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. నిజంగా ఆరోజున సమంత కానీ నాగచైతన్య కానీ క్లారిటీ ఇస్తారేమో లేదో చూడాలి అంటున్నారు సినీ ప్రియులు.
ఇదిలా వుంటే `లవ్ స్టోరీ`తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్య అదే ఉత్సాహంతో ఇదే ఏడాది బాలీవుడ్ కు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న `లాల్ సింగ్ చద్దా` మూవీతో బాలీవుడ్ బాట పడుతున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇక సమంత `శాకుంతలం`లో నటిస్తోంది. గుణశేఖర్ ఈ మూవీని ఓ సుందర కావ్యంగా మలుస్తున్నారు.