అక్కినేని కోడలు స్లీప‌ర్ సెల్ తీవ్ర‌వాది..?

Update: 2020-07-26 05:10 GMT
హైద‌రాబాద్ స‌హా మెట్రో న‌గ‌రాల్లో స్లీప‌ర్స్ సెల్ తీవ్ర‌వాదులు యాక్టివ్ గానో లేదా నిర్జీవంగానో జ‌నంలో క‌లిసిపోయి ఉన్నార‌ని ఎప్ప‌టికప్పుడు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు లోక‌ల్ పోలీసుల్ని అలెర్ట్ చేస్తూనే ఉంటాయి. పేలుళ్లు సంభ‌విస్తేనే గుర్తించేవారిని స్లీప‌ర్ సెల్స్ గానే ప‌రిగ‌ణిస్తారు. చూసేందుకు చాలా సింపుల్ గా సాధా సీదాగా క‌నిపిస్తారు. అంత‌లోనే ప్ర‌మాదాల‌కు తెర తీస్తారు.

ఇదంతా ఇప్పుడే ఎందుకు గుర్తు చేయాల్సి వ‌స్తోంది? అంటే.. అందుకు అక్కినేని కోడ‌లు స‌మంతనే కార‌ణం. త‌న‌‌ను ఈ త‌ర‌హా పాత్ర‌లో చూడ‌బోతున్నామ‌ని అభిమానులు భావిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2లో స‌మంత రోల్ పూర్తి ట్విస్టుల‌తో నెగెటెవ్ షేడ్ లో ర‌క్తి క‌ట్టిస్తుంద‌న్న లీకులు ఇప్ప‌టికే అందాయి. స‌మంత తీవ్ర‌వాదిగా క‌నిపిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాజ్ అండ్ డీకే లాంటి ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్లు త‌న పాత్ర‌ను ఎలా తీర్చిదిద్దారు? అన్న ఆస‌క్తి నెల‌కొంది.

ఇక ఫ్యామిలీమ్యాన్ 1 లో ప్రియ‌మ‌ణి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. తీవ్ర‌వాదుల‌కు సాయం చేస్తూ రా అధికారి అయిన త‌న భ‌ర్త‌నే మోసం చేస్తూ ఉంటుంది. అయితే తాను ఒక తీవ్ర‌వాద సంస్థ‌కు ప‌ని చేస్తున్న సంగ‌తి త‌న‌కే  తెలీదేమో అన్నంత స‌స్పెన్స్ ని మెయింటెయిన్ చేశారు. తాజాగా స‌మంత షేర్ చేసిన ఫోటో చూస్తుంటే ఫ్యామిలీ మ్యాన్ 2లో త‌న లుక్ ఇదేనా? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. కోటి 10ల‌క్ష‌ల (11 మిలియ‌న్లు) మంది ఫీల‌వుతున్నారు! అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి ఈ ఫోటోని సామ్ షేర్ చేసింది. ఈ లుక్ లో ఎంత సింపుల్ గా క‌నిపిస్తోందో అంత వ‌యోలెన్స్ బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌నే అర్థం.
Tags:    

Similar News