మొన్నటికి మొన్న స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్ర ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత సామ్ ఏం చేస్తోంది? అన్నదానికి తాజాగా సమాధానం లభించింది. సామ్ ప్రస్తుతం వాల్ పెయింటింగ్ ను అనుసరిస్తోంది. దాని గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ను పంచుకుంది. సమంత వాల్ పై చిత్రలేఖనంతో బిజీ గా కనిపిస్తోంది. రకరకాల రంగుల్ని అలా గోడకు అద్దుతూ చాలా ఉల్లాసంగా కనిపించింది. తన ఆనంద క్షణాలకు క్యాప్షన్ ఇస్తూ- ``ఆ రోజుల్లో ఒకటి.. నువ్వు పెయింటింగ్ చేయలేవు! అని ఏదైనా ఒక స్వరం వింటే.. అన్ని విధాలుగా పెయింట్ చేయండి. ఆ స్వరం నిశ్శబ్దంగా మారుతుంది`` అంటూ వ్యాఖ్యను జోడించింది.
సమంతా - చై అక్కినేని విడిపోతున్నారనే సుదీర్ఘ ఊహాగానాల అనంతరం వన్ ఫైన్ డే ఆ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ఈ జంట. అక్టోబర్ 2న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. అభిమానులు శ్రేయోభిలాషులందరికీ... చాలా చర్చలు .. ఆలోచనల తర్వాత చై.. నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఒక దశాబ్దానికి పైగా స్నేహాన్ని కలిగి ఉన్నందుకు మేము అదృష్టవంతులం. అది మా బంధానికి చాలా ప్రధానమైనది. ఇది ఎల్లప్పుడూ మా మధ్య ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని.. మేము ముందుకు సాగడానికి అవసరమైన గోప్యతను అందించాలని మా అభిమానులు.. శ్రేయోభిలాషులు మీడియాను మేము అభ్యర్థిస్తున్నాం. మీ సపోర్ట్ కి ధన్యవాదాలు`` అని సమంత అధికారిక ప్రకటనలో పంచుకున్నారు.
ఈ ప్రకటన అనంతరం బాలీవుడ్ లో కెరీర్‌ను కొనసాగించడానికి సమంత ముంబైకి వెళ్లాలని యోచిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. సమంతా తన మొదటి బాలీవుడ్ చిత్రానికి సంతకం చేసిందని త్వరలో అనౌన్స్‌మెంట్ చేయబోతున్నట్లు కథనాలొచ్చాయి. ఈలోగానే తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ సినిమాకి.. ఓ ప్రముఖ తమిళ బ్యానర్ లో మూవీకి సామ్ సంతకం చేశారు. ఇటీవలే ప్రకటనలు వెలువడ్డాయి.
ఇప్పుడు సంతోషించు.. రేపటి కోసం పోరాడు!
ఇటీవల విడాకుల ప్రకటన తరువాత కూడా సామ్ నిత్యం తన ఇన్ స్టా పోస్ట్ లతో హాట్ టాపిక్ గా మారుతోంది. విడాకుల ప్రకటన చేసిన దగ్గరి నుంచి ఏదో ఒక పోస్ట్ తో తన అంతర్మథనాన్నివ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూనే వుంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి డెహ్రాడూన్ తో పాటు రిషీకేష్ కి వెళ్లిన సామ్ అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఆ వీడియోని అభిమానులతో పంచుకుని ఆసక్తిని రేకెత్తించింది. తన చుట్టూ ప్రస్తుతం అలుముకున్న చీకట్లు తొలగిపోవాలని ప్రస్తుతం అధ్యాత్మిక యాత్రలు చేస్తున్న సమంత `ఇప్పుడు సంతోషించు.. రేపటి కోసం పోరాడు ..`` అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇటీవల తన చార్ ధామ్ యాత్రను ముగించిన సంగతి తెలిసిందే. యుమునోత్రి నుంచి తన యాత్రని ప్రారంభించిన సమంత గంగోత్రి.. బద్రీనాథ్..కేదార్ నాథ్ ఆలయాలని సందర్శించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి సమంత తన ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. అలాగే రిషీకేష్ లోని మహేష్ యోగి ఆశ్రమాన్ని సందర్శించిన సమంత అక్కడి ఆశ్రమం నుంచి ఓ వీడియోని షేర్ చేయగా వైరల్ అయ్యింది.