ఈ సినిమా బామ్మ చాలా స్పెషల్

Update: 2019-03-16 05:39 GMT
సరిగ్గా 21 ఏళ్ళ క్రితం శంకర్ జీన్స్ అనే సినిమా వచ్చింది. ప్రశాంత్ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరొయిన్ గా రూపొందిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ సంగీతం సౌత్ ని ఒక ఊపు ఊపేసింది. ప్రశాంత్ తో పాటు నాజర్ రాధికలు డ్యూయల్ రోల్స్ చేసిన అరుదైన చిత్రంగా ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా చలాకీగా హుషారుగా బామ్మ పాత్రలో నటించిన లక్ష్మి గారికి మంచి పేరు వచ్చింది.

పాటల్లో ఏ మాత్రం బెరుకు లేకుండా స్టెప్స్ వేయడం థియేటర్లలో ఈలలు కేకలు వేసేలా చేసింది. ఆవిడ అంతకు ముందే అల్లుడా మజాకాలో డాన్స్ చేసినప్పటికీ జీన్స్ లో సాంగ్స్ చాలా స్పెషల్. ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో లక్ష్మి గారి ఎనర్జీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఓ బేబీలో సమంతాతో సైతం అదే తరహలో పాటల్లో కాలు కదపడం చూసి అందరూ షాక్ అవుతున్నారు

కారణం లేకపోలేదు. జీన్స్ వచ్చిన ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు లక్ష్మి గారి వయసు ఎంత ఉంటుందో లెక్కగట్టడం పెద్ద కష్టమేమి కాదు. అయినా వయో భారాన్ని లెక్క చేయకుండా అప్పుడు ఐశ్వర్య రాయ్ తో ఇప్పుడు సమంతాకు ఒకే తరహలో మెప్పించడం లక్ష్మిగారికే సాధ్యమేమో. ఓ బేబీ సినిమాలో లక్ష్మి గారు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ కూడా పూర్తయిపోయింది.

ఈ సందర్భంగానే నిన్న విడుదల చేసిన స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ ఓ బ్లాక్ బస్టర్ కొరియన్ మూవీకి రీమేక్. ఈ బామ్మా మనవరాలో పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలిసింది. మరి లక్ష్మిగారి విశ్వరూపం మరోసారి ఏ రేంజ్ లో ఉందో చూడాలంటె ఓ బేబీ వచ్చే దాకా ఆగాలి
Tags:    

Similar News