అందాల సమంతను కోలీవుడ్, టాలీవుడ్ లో దేవతగా భావిస్తున్నారు. దర్శకనిర్మాతల హీరోయిన్ గా పాపులరైందీ భామ. పట్టు విడుపు ఉన్న భామగా, మంచి మనసున్న మారాణిగా అందరికీ తెగ నచ్చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించేసింది. తమిళ్ లోనూ విజయ్ - సూర్య - విక్రమ్ - ధనుష్ ఇంతమంది స్టార్లకు తనే ఆప్షన్ ఇప్పుడు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న సమంత ఉన్నట్టుండి సినిమాలు వదిలేసి వెళ్లిపోతానంటే పరిశ్రమలన్నీ ఏమైపోవాలి? అభిమానుల పరిస్థితేంటి? కానీ ఈ అమ్మడి నోటినుంచి వదిలేస్తాననే మాట వచ్చింది. డీటెయిల్స్ లోకి వెళితే..
2014 కంటే ముందే నేను ఓ ప్రామిస్ చేశాను. నాకు నచ్చే క్యారెక్టర్లు దక్కనప్పుడు నిర్ధాక్షిణ్యంగా నటనను వదిలేస్తానని చెప్పాను. చెట్టు, పుట్టల్లో హీరోతో ఐదారు డ్యూయెట్లు పాడుకోవడానికి, నాలుగైదు సీన్లలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలాంటి క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధంగా లేను. అలాంటి పరిస్థితి వస్తే వదిలేసి వెళ్లిపోతా. ఆ మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. కానీ ఇప్పుడు నేను నటిస్తున్నవన్నీ సంతృప్తినిచ్చే పాత్రలే. ఈ ఏడాది మరింత సంతృప్తిగా ఉన్నా.. అని చెప్పింది సమంత. 2015లో నా కెరీర్ లోనె ది బెస్ట్ క్యారెక్టర్లలో చేస్తున్నా. ప్రస్తుతం విక్రమ్ సరసన 10ఎంద్రాతుకుళ్ల, సూర్య సరసన 24, విజయ్ తో విజయ్ 59 చిత్రాల్లో నటిస్తున్నా. మహేష్ సరసన బ్రహ్మూెత్సవంలోనూ నటిస్తున్నానని చెప్పింది.