సమంతా.. నీకు నచ్చిన రోగం ఏంటి?
మన హీరోలకూ హీరోయిన్లకూ ట్విట్టర్లో గాట్టి ఫాలోయింగే ఉంది. మన అతి పెద్ద స్టార్ హీరోలను సైతం దాటేసి.. శృతి హాసన్ కు 5.29 మిలియన్లు ఉండగా.. నిన్నే చెన్నయ్ చంద్రం సమంత కూడా 4 మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా అమ్మడు #AskSam అంటూ యథావిథిగా ఒక ప్రశ్నోత్తరాల సెషన్ కండక్ట్ చేసింది. ఈ సందర్భంగా కొందరు అడిగిన ప్రశ్నలను చూస్తే.. అసలు ఏడవాలో నవ్వాలో కూడా తెలియని పరిస్థితి.
ఒక ఫ్యాన్ మరి అటెన్షన్ పట్టేయాలనో లేకపోతే ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కాని.. ''నీకు నచ్చిన రోగం ఏంటి సమంత??'' అంటూ అడిగాడు. నచ్చిన పుస్తకం.. పట్టణం.. ప్రదేశం.. తినుబండారం.. మనిషి వగైరా వగైరా ఉంటాయి కాని.. నచ్చిన రోగం కూడా ఉంటుందా? ఆ మహానుభావుడు ఎలా అడిగాడో తెలియదు కాని.. సమంత మాత్రం చాలా ఛలాకీగా భలే ఆన్సర్ చెప్పింది. ''ఈ క్వశ్చన్ కు నా దగ్గర ఆన్సర్ లేదు కాని.. ఇకమీదట ఎవరైనా 'నీ జీవితంలో నిన్ను అడిగిన అతి చిరాకైన ప్రశ్న ఏంటీ అంటే.. నా దగ్గర మాత్రం ఆన్సర్ ఉంది'' అంటూ జావాబిచ్చింది సమంత.
ఇకపోతే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. ''సెలబ్రిటీ జాబ్ లో ఉన్నంత ఫేం ఎందులోనూ ఉండదని'' ''తనకు జీవితంలో అతి పెద్ద పాఠాలు నేర్పిన వ్యక్తి జీవితమేనని'' ''చైతూకూ తనకూ ఎప్పుడూ జరిగే చర్చ.. డిన్నర్ గురించేనని'' చెప్పింది.