ఆ విష‌యానికి సామ్ అంత‌లా టెన్ష‌న్ ప‌డింద‌ట‌

Update: 2019-04-15 05:22 GMT
టాలీవుడ్‌లోని న‌టీమ‌ణుల్లో కాస్త భిన్నంగా ఉంటారు స‌మంత‌. ఆమె మాట‌లు.. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్టింగులు హార్ట్ ట‌చ్చింగ్ గా ఉంటాయి. అంతేనా.. ఎన్జీవోను ర‌న్ చేస్తూ త‌న‌లోని మాన‌వ‌తా కోణాన్ని పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోకుండానే వీలైనంత ఎక్కువ హెల్ప్ చేస్తుంటారు.

స‌మంత చాలా ఎమోష‌న్ గా ఉంటుంద‌న్న మాట ఆమె స‌న్నిహితుల నోట వినిపిస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో ఆమెను రెగ్యుల‌ర్ గా ఫాలో అయ్యే వారికి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. తానిచ్చే ఇంట‌ర్వ్యూల‌లోనూ.. తాను పాల్గొనే కార్య‌క్ర‌మాల్లో మాట్లాడే సంద‌ర్భంగా మ‌న‌సు దోచేలా మాట్లాడుతుంటారు.

తాజాగా అలాంటి ప‌నే చేశారు స‌మంత‌. ఒక యాప్ ను లాంఛ్ చేసే కార్యక్ర‌మానికి వ‌చ్చిన ఆమె.. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికి త‌మ జీవితంలో కొన్ని వ‌స్తువుల‌తో ప్ర‌త్యేక‌ అనుబంధం ఉంటుంద‌ని.. త‌న‌కు అలాంటివి కొన్ని ఉన్నాయ‌న్నారు.

పెళ్లి నాటి చీర‌తో త‌న‌కు అలాంటి అటాచ్ మెంట్ ఉంద‌ని.. డ్రైవాష్ కు ఇచ్చే టైంలో ఎంతో టెన్ష‌న్ ప‌డ్డాన‌ని.. తిరిగి వ‌చ్చే వ‌ర‌కూ మ‌న‌సు మ‌న‌సులో లేద‌న్నారు. డ్రైవాష్ నుంచి చీర వ‌చ్చిన త‌ర్వాత దాన్ని అసాంతం చెక్ చేసుకొన్నాన‌ని.. ఎలాంటి డ్యామేజ్ లేక‌పోవ‌టంతో తానెంతో రిలీఫ్ అయ్యాన‌ని చెప్పారు. పెళ్లి విష‌యంలోనే కాదు.. దానికి సంబంధించిన విష‌యాల్లో తానెంత కేర్ ఫుల్ గా ఉంటాన‌న్న విష‌యాన్ని స‌మంత చెప్ప‌క‌నే చెప్పేసింది క‌దూ?
Tags:    

Similar News