అక్కినేని కోడ‌లా? జ‌క్సిస్ మ‌హారాణి గారా?

Update: 2020-06-14 05:30 GMT
అక్కినేని కోడ‌లా.. జక్సిస్ మ‌హారాణినా? ..ఏమో.. ఏమైనా కావొచ్చు. ఆ అలంక‌రణ తీరు చూస్తుంటే 300 మూవీలో జ‌క్సిస్ మ‌హారాజు.. ఆయ‌న ఆస్థానంలో కొలువు దీరిన మ‌హారాణులు గుర్తుకు రాకుండా ఉంటారా?  రోమ‌న్ల వ‌స్త్ర‌ధార‌ణ‌కు ట్రాయ్ క‌ల్చ‌ర్ లో అరుదుగా క‌నిపించే డిజైన‌ర్ ట్రెడిష‌న్ కు భార‌తీయ‌త‌ను అద్దిన‌ట్టే అబ్బుర‌ప‌రుస్తోంది ఈ లుక్.

సంథింగ్ ఏదైనా కొత్త‌గా చూపిస్తేనే ఈరోజుల్లో కెరీర్ బండి సాగుతోంది. అందుకే నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో సామ్ ఏదో ఒక కొత్త‌ద‌నం వైవిధ్యం కోసం త‌పిస్తోంది. తాజాగా సామ్ కి సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో స్ట‌న్న‌యిపోయేలా హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది. ఒక‌ర‌కంగా ఈ లుక్ మైమ‌రిపించింది. ఈ ఫోటోలో స్ట‌న్నింగ్ గోల్డ్ మెటాలిక్ గాగ్రా అద్భుతం. ఇక క్రిస్ట‌ల్స్ తో తీర్చిదిద్దిన ఆ హాఫ్ ఎక్స్ ప్లోజివ్ డిజైన‌ర్ టాప్ యూత్ ని ఒక ర‌కంగా రెచ్చ‌గొట్టేస్తోంది. రారాణుల‌కే సాధ్య‌మా ఈ అందం అన్నంత‌గా మురిపిస్తోంది.

ఇక ఆ బాట‌మ్ లో క‌ళాకృతులు నిండిన డిజైనింగ్ అబ్బుర‌ప‌రుస్తోంది. ఆ కాలికి ఎంపిక చేసిన రాణీ వారి చెప్ప‌ల్స్ కూడా అంతే డిజైన‌బుల్ గా వ్వావ్ అనిపిస్తున్నాయి. ఆ మెడ‌లో అలంక‌రించిన క్రిస్ట‌ల్ ఆభ‌ర‌ణం ఇంకా వ్వావ్ అనిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో ఇలాంటి బెస్ట్ డిజైన‌ర్ డ్రెస్ వేరొక‌టి లేదేమో! అన్నంత‌గా కుదిరింది. సామ్ ప్ర‌స్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో అభిమానుల్ని అల‌రించ‌నుంది. త‌దుప‌రి నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించ‌నుంది. త‌మిళంలోనూ ప‌లు ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసింది.
Tags:    

Similar News