ఫోటోస్టోరీ: లెహంగాలపై సమంత ప్రేమ

Update: 2017-09-18 04:56 GMT
టాలీవుడ్ బ్యూటీ సమంత ఎంత డేరింగ్ మహిళో చెప్పడానికి మాటలు చాలవు. సహజంగా ఓ స్థాయికి చేరుకున్న తర్వాత.. హీరోయిన్స్ అందాల మెరుపులు తగ్గుతుంటాయి. క్రేజ్ పెరుగుతున్న కొద్దీ.. భామలు ధరించే డ్రెస్సుల సైజులు పెరిగి.. వయ్యారాలు తగ్గుతుంటాయి. కొందరు మినహాయిస్తే ఎవరూ దీనికి అతీతులు కాదు. స్టార్ స్టేటస్ అందుకున్నాక మెయింటెయిన్ చేసిన అందాలను ప్రదర్శించడంలో పొదుపు పాటించేస్తుంటారు.

కానీ సమంత మాత్రం ఈ విషయంలో బోలెడంత ధైర్యం చేస్తుంటుంది. తన స్టైలింగ్ స్టేట్మెంట్ తోనే చాలా మాటలు చెప్పేస్తుంటుంది. తాజాగా ఈ భామ ఓ స్పెషల్ ఫోటో షూట్ చేసింది. ఇందులో చోళీ.. లెహంగా.. మాత్రమే ధరించిన సామ్ మనకు దర్శనం ఇస్తుంది. క్లీవేజ్ అందాల ప్రదర్శనకు బోలెడంత సాయం చేసే చోళీ.. మేనికి బోలెడన్ని మెరుపులు ఆపాదిస్తున్న లెహంగా.. డిజైనర్ వేర్ కావడంతో.. సమంత మెరుపులు మరింతగా పెరిగిపోయాయి. అయితే.. ఈ డ్రెసింగ్ తో పాటు సమంత చెప్పిన ఇతర కబుర్లు కూడా ఉన్నాయి.

'మొత్తం ప్రతిభ అంతా.. మొత్తం అందం అంతా.. తన మనసులో సరైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆమె ఎవరో కాదు.. నాకు అత్యంత ప్రియమైన స్నేహితురాలు క్రెషా బజాజ్. లెహంగాలపై ఆమెకున్న ప్రేమ.. ఓ ఫెయిరీ టేల్ లాంటింది. నా పెళ్లి విషయంలోనే నేను ఎవరినైనా నమ్ముతానంటే అది తనే. ఆమెని నమ్మేశా కూడా. ఇంకా నమ్మేస్తా' అంటూ ఇన్ డెరెక్ట్ గా తన పెళ్లికి డిజైనర్ ఎవరో చెప్పింది సమంత.
Tags:    

Similar News