కంగనాపై సమంత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Update: 2019-01-29 07:27 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజాగా హిందీలో 'మణికర్ణిక' చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. కేవలం నటించడం మాత్రమే కాకుండా ఆ చిత్రం దర్శకత్వ బాధ్యతలను కూడా చూసుకుంది. క్రిష్‌ ఆ సినిమా నుండి మద్యలో తప్పుకోవడంతో బ్యాలన్స్‌ వర్క్‌ ను కంగనా పూర్తి చేసింది. పలు వివాదాలు వస్తున్నా కూడా సినిమాలో కంగనా నటనపై మాత్రం ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక అద్బుతమైన పాత్రలో కంగనా నటించి, ఆ పాత్రకు ప్రాణం పోసింది అంటూ విమర్శకులు సైతం అంటున్నారు. సినిమా ఓవరాల్‌ ఫలితంపై ఇంకా పూర్తి క్లారిటీ అయితే రాలేదు కాని, కంగనా సాహసాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

తాజాగా సమంత కూడా కంగనాపై ప్రశంసలు కురిపించింది. మణికర్ణిక సినిమాపై సమంత స్పందిస్తూ... కంగనానే నా హీరో, హీరోయిన్స్‌ ఎవరు కూడా సాహసించని ఒక గొప్ప యాక్షన్‌ కథను ఎంపిక చేసుకుని, దాంట్లో అద్బుతంగా నటించడం కేవలం కంగనాకే సాధ్యం అయ్యింది. అద్బుతంగా నటించింది అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కేవలం సమంత మాత్రమే కాకుండా కంగానపై అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సమంత ప్రస్తుతం భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' చిత్రంలో నటిస్తూనే మరో లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తమిళంలో కూడా విజయ్‌ సేతుపతితో ఒక చిత్రంలో నటిస్తోంది.
Tags:    

Similar News