మా అమ్మే ఇప్పుడు నా కూతురు - నాగ్

Update: 2017-01-29 18:55 GMT
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య.. సౌత్ బ్యూటీ సమంతల ప్రేమాయణం గురించి చాలా కాలంగా వింటూనే ఉన్నాం.  పేర్లు పైకి చెప్పకపోయినా.. దాసరి లాంటి ప్రముఖులు కూడా 'ఏం మాయ చేసిందో ఆ హీరోయిన్' అంటూ ముందుగానే హింట్స్ చాలానే ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తరచుగా కాదు.. తప్పనిసరిగా కనిపించిన సమంత.. ఇప్పుడు తనే ఓ ఫంక్షన్ కు నాంది అయింది.

ఇప్పుడు నాగచైతన్య-సమంతల నిశ్చితార్ధం జరిగిపోయింది. 'చెయ్ శామ్' అంటూ ఇద్దరి పేర్లను కలిపి మరీ నాగార్జున ఓ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో ప్రత్యేకంగా చేసిన ఓ ట్వీట్ అందరినీ హృదయాలను ఆకట్టుకుంటోంది. 'చెయ్ శామ్.. ఇప్పుడు అధికారికమే. మా అమ్మే ఇప్పుడు నా కూతురు అవుతోంది. ఇంతకంటే ఆనందం ఏముంటుంది' అంటూ ట్వీట్ చేశాడు అక్కినేని నాగార్జున. తనకు పెద్ద కోడలుగా రాబోతోన్న సమంతను.. అటు అమ్మ అంటూనే ఇటు కూతురు అనేశాడు నాగ్.

మనం మూవీలో నాగార్జునకు అమ్మగా సమంత కనిపించిన కనిపించింది. ఆ రిఫరెన్స్ ను ఇటు రియల్ లైఫ్ కి అప్లై చేసి.. మా అమ్మే కూతురుగా వస్తోందన్నాడు నాగ్. మరోవైపు.. కాబోయే కోడలిని.. అమ్మతో సమానంగా.. ఓ కూతురుగా చూసుకుంటానని నాగార్జున ఎంత అందంగా చెప్పాడో కదూ!

నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ ఫొటోస్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి : https://goo.gl/ZSbWa8
Tags:    

Similar News