దక్షిణాది అగ్ర కథానాయిక సమంత.. తన భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను మర్చిపోవడం కోసం వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
ఆదివారం జరిగిన ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఈవెంట్ లో సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. అవకాశం వస్తే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించాడని రెడీ అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది. ''మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాను. నాక్కూడా హిందీ సినిమాలు చేయాలనే ఆసక్తి ఉంది. నార్త్ ఇండస్ట్రీకి సౌత్ కు పెద్ద తేడా ఏమీ లేదు'' అని సామ్ అభిప్రాయపడింది.
''నిజం చెప్పాలంటే సినిమా ఓకే చేయడంలో భాష అనేది సమస్య కానే కాదు. ఏదైనా ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు.. కథలో విషయం ఉందా లేదా? ఆ కథకు నేను సెట్ అవుతానా? పాత్రకు న్యాయం చేయగలనా? అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను'' అని సమంత తెలిపింది. ఇదిలా ఉంటే తాజాగా బీ టౌన్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సామ్ మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయిందని తెలుస్తోంది.
దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన 'ఫ్యామిలీ మ్యాన్-2' సిరీస్ తో సమంత డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. రాజీ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ తో నార్త్ ఆడియన్స్ లో కూడా సామ్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో రాజ్ & డికె తో కలిసి మరో వెబ్ సిరీస్ చేయడానికి సమంత సిద్ధంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. మేకర్స్ సరికొత్త వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
'రాజ్ డీకే దర్శకత్వంలో సమంత రూత్ ప్రభు ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తే ఎలా ఉంటుంది? అమేజింగ్ కాంబో కదా?' అని ఓ నెటిజన్ సామ్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. దీనికి స్పందించిన సమంత స్మైలీ ఎమోజీలను రిప్లై గా ఇచ్చింది. ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్' సృష్టికర్తలతో ఆమె మరో వెబ్ సిరీస్ చేస్తుందా లేదా మూవీ ప్లాన్ చేస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో సామ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ మీద క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇకపోతే విడాకుల ప్రకటన తర్వాత సమంత రెండు తెలుగు తమిళ ద్విభాషా చిత్రాలను అధికారికంగా ప్రకటించింది. అలానే 'పుష్ప' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది. సామ్ కెరీర్ లో ప్రత్యేక గీతం చేయడం ఇదే తొలిసారి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే 'శాకుంతలం' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. తమిళ సినిమా 'కాతువాకుల రెండు కాదల్' డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.