అక్కినేని వారి కోడలు ఆరాటపడుతోందే

Update: 2017-05-17 11:17 GMT
ఈ ఏడాది మొదటి నెలలో ఇద్దరి కొడుకులుకు ఒకే సారి పెళ్లి నిచ్చితార్దం చేసి నాగార్జున ఓ మంచి బాధ్యతగల తండ్రి గా మంచి మార్కులు కొట్టేశాడు. చిన్న కొడుకు సంగతి పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు నాగ చైతన్య సమంత ప్రేమ సౌత్ మొత్తం హాట్ టాపిక్ లా మారింది. అందరూ సమంతని ఇప్పుడు తన ఇంటి పేరుతో మానేసి అక్కినేని కోడలు అని పిలుస్తున్నారు.

ఈ విషయం లో సమంత చాలా సంబరపడిపోతుంది. తన పేరు పక్కన నాగ చైతన్య పేరు పెట్టుకోవాలిని తెగ తొందర పడుతుంది. ఈ మధ్యన ట్విటర్ లో సమంత రిప్లయ్ లు చూస్తే మీకే అర్ధంవుతుంది. రా రాండోయి వేడుక చూద్దాం ప్రోమోకి కూడా ఎలా రియాక్ట్ అయ్యిందో మీకు తెలిసిందే. ఇప్పుడు హీరో  రామ్ ట్విటర్ లో  సమంత అక్కినేని అని సంబోధించినప్పుడు.. అమ్మడు చాలా ఆనందపడి  వెంటనే సంతోషం గా బదులు ఇచ్చింది.

నాగ చైతన్య కు సమంతకు జనవరి లో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. తరవాత నుండి  సమంత కూడా చైతు ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళు కలిసి వండుకుంటున్న ఫోటోలు.. కలిసి బోజనం చేసిన పిక్స్ ఒకేసారి మంఆచి వైరల్ కూడా అయ్యాయి. వీళ్ళు పెళ్లి తరువాత బ్యాంకాక్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారనేది టాక్. అదండీ ఈ హ్యాపీ కపుల్ స్టోరి మరియు సమంత 'అక్కినేని' ఆరాటం!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News