మరికొద్ది రోజుల్లో హీరోయిన్ సమంత అక్కినేని వారింటి కోడలు కానుంది. అక్టోబరు 8న గోవాలో నాగచైతన్యతో సమంత వివాహం జరగనుంది. అక్కినేని కుటుంబమంతా ఈ వివాహ సందడిలో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత దాదాపు రెండు నెలలపాటు ఈ జంట హనీమూన్ ట్రిప్ కు విదేశాలకు వెళ్లొస్తుంది. తిరిగొచ్చాక పెండింగ్ లో ఉన్న షూటింగులు కంప్లీట్ చేసేలా వీరిద్దరూ ప్లాన్ చేసుకున్నారు.
ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించింది. అప్పటి నుంచి ఏదో ఫొటోలకు ఫోజులిచ్చాం అన్నట్టు కాకుండా చేనేతకు పేరు తెచ్చేలా గట్టి ప్రయత్నాలే చేస్తోంది సమంత. చేనేతను ఆమె ప్రమోట్ చేస్తున్న తీరు టీఆర్ ఎస్ నేతలకు కూడా బాగా నచ్చింది. దీంతో రీసెంట్ గా సమంత రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం మొదలైంది. పాలిటిక్స్ లో ఏదయినా ప్రచారం మొదలైతే దానిని మరింత రంజుగా మార్చడానికి మరిన్ని పాయింట్లు జోడించేస్తుంటారు కదా.. సమంత విషయంలోనూ అదే చేస్తున్నారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా చెప్పేస్తున్నారు. సమంత క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నుంచి జయసుధ పోటీ చేస్తుందని ఓ టాక్ ఉంది. అయితే జయసుధ ఈ విషయం గురించి ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఆమెకు పోటీ అంటూ టీఆర్ ఎస్ నుంచి సమంత పేరు తెరపైకి తెచ్చారు. సమంత హీరోయిన్ గా ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉంది. అసలు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇంతవరకు ఎవరూ పాలిటిక్స్ లోకే దిగలేదు. అలాంటిది ఏకంగా ఇంత చిన్న వయసులో సినిమాలు వదిలేసి మరీ పాలిటిక్స్ లోకి వచ్చేస్తుందని ప్రచారం చేయడం మరీ సిల్లీగా లేదూ..