సమంత ఇక సర్దేయాల్సిందేనా?!

Update: 2015-04-11 23:30 GMT
లక్కీగాళ్‌ అనిపించుకొన్న కథానాయిక సమంత. ఒకప్పుడు ఆమెకి వద్దంటే అవకాశాలు, నటించిందంటే విజయం. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా మూడు సినిమాలు వరసగా ఆమెకి నిరాశని మిగిల్చాయి. గతేడాది చేసిన రెండు సినిమాల్లో సమంత గ్లామర్‌గానైనా కనిపించింది. కానీ ఇటీవల విడుదలైన సినిమాలో మాత్రం పేషంట్‌గా కనిపించింది. అటు నటన లేదు, ఇటు గ్లామరూ లేదు. దీంతో సమంతకి గట్టి షాక్‌ తగిలినట్టయింది.

      చేసిన సినిమాల పరిస్థితిని పక్కపెడితే కనీసం ఇప్పుడు చేయడానికి ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో హిట్టు కొట్టి ఆ తర్వాత అవకాశాల అంతు చూద్దామనుకొంది. కానీ ఆ ప్లాన్‌ వర్కవుట్‌ అయ్యేలా కనిపించడం లేదు. సమంత కంటే ఆమె తర్వాత వచ్చిన కథానాయికలు బెటర్‌ కదా అంటూ రకుల్‌ప్రీత్‌సింగ్‌, రాశిఖన్నా, ఆదాశర్మ లాంటి అందగత్తెల్ని సంప్రదిస్తున్నారు దర్శకులు. వీళ్ల పారితోషికాలు కూడా అందుబాటులోనే ఉండటంతో సమంతలాంటి కథానాయికల దగ్గరికి ఎవ్వరికీ  వెల్లడం లేదు. మరోపక్క పరాజయాల భారం కూడా అధికం కావడంతో ఇక సమంత సర్దేయాల్సిందే అన్న కామెంట్లు సమంతని విసిగిస్తున్నాయట. ఆమె తమిళ సినిమాలపై సీరియస్‌గా దృష్టిపెట్టే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి.

Tags:    

Similar News