చైతన్య - సమంత జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన `మజిలి` ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సినిమా మధ్య తరగతి నేపథ్యంలో తెరకెక్కే సినిమా అంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో రెండో నాయికతో చైతూ రొమాన్స్ చూశాక ఇది ముక్కోణపు ప్రేమకథా? అన్న సందేహం కలుగుతుంది. కానీ అలాంటిదేమీ లేదని సామ్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ సినిమాలో రకరకాల లేయర్స్ ఉంటాయని సమంత తెలిపారు. హీరోగారికి అప్పటిదాకా ఒకమ్మాయితో లవ్ ఉంటుంది. అంతసేపు ఆ ప్రేమ జంటను చూసి ఆనందించిన ఆడియన్ ఉన్నట్టుండి నా పాత్ర ప్రవేశాన్ని అంగీకరించాలి. అంటే తొలి సన్నివేశంలోనే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఏదో అక్కడ ఇంపాక్ట్ చూపించాలి. పైగా ఎక్కువ మాట్లాడలేను. అలాంటప్పుడు అది నాకు చాలెంజింగ్ పాత్రే కదా. కొన్నిసార్లు కళ్లతో భావాలు పలికించాలి. కొన్ని సార్లు కేవలం నా అభినయంతోనే అంతా చెప్పగలగాలి. ఈ కథలో నాకు కనెక్ట్ అయినది అదేనని తెలిపారు.
పెళ్లయ్యాక ఆయనతో నటించడం ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? అని ప్రశ్నిస్తే.. నాకు ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ఎవరైనా సరే నా పాత్రకు నును 100 శాతం న్యాయం చేశానా లేదా అనే ఆలోచిస్తానని సామ్ తెలిపారు. యాక్షన్ అనగానే నా ముందున్నది ఎవరు? వాళ్లతో నాకున్న బంధం ఏంటి? వాళ్లను నేను ఇష్టపడతానా.. ఇష్టపడనా?... అసలు ఇలాంటివేమీ పట్టించుకోనని అన్నారు. చైతూతో కలిసి నటించినప్పుడు అలానే చేశానని అన్నారు.