ముద్దు ముచ్చట అంత పని చేస్తుందని అనుకోలేదు! ముద్దు గురించి అడిగేస్తే ఆమె అలా సీరియస్ అవుతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ సీరియస్ అయ్యారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో ముద్దు ముచ్చట గురించి ప్రశ్నించినా ఎన్నడూ సీరియస్ అవ్వని సమంత ఈసారి ఎందుకనో సీరియస్ అయ్యారబ్బా!! అంటూ ప్రస్తుతం మీడియాలో చెవులు కొరికేసుకుంటున్నారంతా.
అసలింతకీ ఏమైంది? అంటే... నేడు `మజిలీ` మీడియా ఇంటర్వ్యూలో హైదరాబాద్ పాత్రికేయులతో ముచ్చటించిన సామ్ కి ప్రశ్నల పరంపర నుంచి ఓ శరం లాంటి ప్రశ్న సూటిగా తాకింది. తాకలేదు సూటిగా గుచ్చుకుంది. నాగచైతన్య మజిలీ చిత్రంలో సామ్ ని కాకుండా రెండో నాయికను అలా డీప్ కిస్ లాగించేశారు కదా? మీరేమీ ఫీలవ్వరా? అన్న ప్రశ్న సామ్ కి ఎదురైంది. ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ సీనియర్ జర్నలిస్టు కాస్తంత చొరవగానే స్పందిస్తూ .. ఏకాంత సమయాన ఆ సన్నివేశాలు చైకి అనుభవమే కదా! అనే అర్థంలో ఏదో అనేశారు. అయితే అది యథాలాపంగానో, యాథృచ్ఛికంగానో సామ్ ని ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన చొరవతోనో అతడు అలా అనేశారు కానీ.. ఎందుకనో సామ్ కాస్తంత సీరియస్ అయ్యారు. ``నేను డీప్ గా వెళితే వేరొకలా ఉంటుంది.. కానీ వెళ్లను!`` అంటూ సినిమాటిగ్గానే స్పందించారు. అయితే బరువెక్కిపోతున్న వాతావరణాన్ని లైట్ వెయిట్ కి తగ్గించేందుకు ఈ రోజుల్లో దర్శకులు సంప్రదాయ బద్ధంగా సినిమాలు తీస్తున్నారు. కథానాయికలు హుందా అయిన పాత్రలు చేస్తున్నారు కదా! అంటూ కవరింగ్ చేసేశారు.
ఇంతకీ సినిమాలో లిప్ లాక్ లు గురించి కాంట్రవర్శీలు వచ్చాయి కదా.. మీ స్పందన ఏంటి? అని సామ్ నే అడిగేస్తే.. కిస్ - హగ్గు - టచ్... స్క్రీన్ పైన ఏదైనా ఒకటే. నేను నటిగా దాన్ని అలాగే చూస్తానంతే. ఎందుకంటే ఆ సీన్ కి కిస్ కావాలి. అక్కడ మాటలు దాటిన ఎమోషన్ ఉంది. అందుకే చైతన్య కిస్ చేశారు.. అంటూ వివరణ ఇచ్చారు సమంత. ఆ సీన్ చేసినప్పుడు మీరెలా ఫీలయ్యారు? అన్న ప్రశ్నకు.. సీన్ చేశారని నాకు ముందు తెలియదు. ఓసారి శివగారు `సమంతా రండి. మీకు చూపిస్తాను` అని చూపించారు. నేను చూసిన తర్వాత `ఓహో కిస్ చేశారా` అని అనుకున్నా.. అంటూ నవ్వేశారు. కథానాయికల్ని కేవలం గ్లామర్ పాత్రల్లో చూడాలని అనుకోవడం లేదు. అందుకే దర్శకుల్లోనూ మార్పు వస్తోందని ముచ్చట్లాడారు సామ్. మజిలి ఏప్రిల్ 5న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.