దెబ్బ‌లు తిన్నాకే అన్నీ తెలిశాయి

Update: 2015-09-10 12:05 GMT
టాలీవుడ్‌, కోలీవుడ్‌ లో స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించేస్తోంది స‌మంత‌. సుదీర్ఘ కెరీర్‌ లో ఎన్నో అనుభ‌వాలు. ప్ర‌స్తుతం చేస్తున్న త‌మిళ సినిమా అనుభ‌వాలు స‌హా అన్నిటినీ త‌న అభిమానుల‌తో పంచుకుందిలా....

=ప్ర‌స్తుతం కో్లీవుడ్‌ కే అంకిత‌మ‌య్యా. ధ‌న‌ష్‌ తో వీఐపీ (వేలై ఇళ్ల ప‌ట్టాధారి) , విక్ర‌మ్‌ తో 10 ఎంద్రాతుకుళ్ల‌, సూర్య స‌ర‌స‌న 24, విజ‌య్ స‌ర‌స‌న అట్లీ సినిమా.. ఇన్ని చేస్తున్నా. వీఐపీ 2 త్వ‌ర‌లోనే రిలీజ్‌ కి రెడీ అవుతోంది. మిగ‌తా సినిమాలు ప్రోగ్రెస్సింగ్‌ లో ఉన్నాయి.

=10 ఎంద్రాతుకుళ్ల చిత్రంలో నేపాళీ అమ్మాయి గెట‌ప్‌ లో క‌నిపిస్తాను. అది చూసి ద్విపాత్రాభిన‌యం అనుకుంటున్నారు. కానీ కాదు. ఈ చిత్రంలో 60 డిఫ‌రెంట్ లొకేష‌న్ ల‌లో నేను క‌నిపిస్తా.

=విక్ర‌మ్‌ తో సినిమా కోసం చాలా రిస్కీ ఫీట్స్ వేశా. జీప్‌ లు, కార్‌లు డ్రైవ్ చేశా. దెబ్బ‌లు తిన్నా. పాట‌లు, ప్రేమ‌ల్లో బాగానే చేస్తున్నా. ఫైట్స్ చేస్తే త‌ప్పేం ఉంది అని రిస్క్ తీసుకున్నా. అందుకు దెబ్బ‌లు తినాల్సొచ్చింది. ఏదైనా అనుభ‌వంతోనే తెలుస్తుంది.

= ఇదే చిత్రంలో ఓ తెల్ల‌గుర్రంపై స్వారీ చేశాను. వాస్త‌వానికి స్వారీ రాక‌పోయినా .. ఓ గుంపులోంచి తెల్ల గుర్రాన్ని ఎంచుకుని దాన్ని మ‌చ్చిక చేసుకున్నా. క్ష‌ణాల్లో దానిని అధిరోహించి స్వారీ చేస్తుంటే యూనిట్ అవాక్క‌య్యి చూస్తుండి పోయింది. భ‌యం లేకుండా చేసినందుకు నాకే ఆశ్చ‌ర్యం అనిపించింది.

=నా కెరీర్‌ లో వీఐపీ 2 వెరీ స్పెష‌ల్‌. ఇందులో చీర క‌ట్టులో క‌నిపించాను. అందులో త‌ళ‌త‌ళ‌లాడిపోయా. చీర‌లో న‌న్ను నేను చూసుకుని ఆశ్చ‌ర్య‌పోయా. ఫ్యామిలీ రోల్ చేశాను ఇందులో.

=అనుష్క‌, ఎమీజాక్స‌న్ అంటే ఇష్టం. పాత్ర కోసం ఎంతైనా శ్ర‌మిస్తారు. ఎలాగైనా మారిపోతారు. అనుష్క సైజ్ జీరో కాసం అంత లావైంది. ఏ హీరోయిన్ అలా చేయ‌లేరు. పాత్ర కోసం అంత త‌పిస్తుంది త‌ను. అందుకే ఇష్టం.

=నేను చేసే సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చారం కావాల‌నుకోవ‌డం లేదు. ఓ సంస్థ‌ను ప్రారంభించి వాటిని నిరంత‌రాయంగా కొన‌సాగిస్తూనే ఉన్నా.

Tags:    

Similar News