స‌మంత న‌డుము ఊపుడు షేకింగే

Update: 2021-12-13 04:39 GMT
ప్ర‌స్తుతం ఏ నోట విన్నా ఊ అంటావా మామా ఊఊ అంటావా! .. పుష్ప ది రైజ్ నుంచి ఐట‌మ్ పాట ఇది. రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ ట్యూన్ ఇప్ప‌టికే యూత్ లోకి దూసుకెళ్లింది. మిలియ‌న్ వ్యూస్ తో సంచ‌ల‌నంగా మారింది.

ఇక ఈ పాట‌లో సమంత న‌డుము ఊపుడు గురించి అదిరిపోయే అంచ‌నాలు పెరిగాయి. మాస్ ఫ్యాన్స్ పుష్ప నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసేందుకు స‌మంత స్పెష‌ల్ నంబ‌ర్ ప్ర‌త్యేక కార‌ణంగా మారింది. ప్ర‌త్యేక పాట అన్నందుకు స‌మంత ఎక్క‌డా త‌గ్గిందే లేద‌ని ఊ అంటావా పాట నిరూపిస్తోంది.

నోరా ఫ‌తేహి ముమైత్ లాంటి ఐట‌మ్ గాళ్స్ న‌డుము ఊపుడు నాట్యంతో అల్లాడించారు. అంత‌కుమించి స‌మంత చెల‌రేగిపోయింద‌ని గుస‌గుస వేడెక్కిస్తోంది మాస్ లో. పుష్ప టీమ్ విడుదల చేసిన 16 సెకండ్ల టీజర్ వీడియోను చూసి సమంత తన నాటు స్టెప్పులతో స్క్రీన్ ని షేక్ చేయ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నా అమాంతం పెరిగింది. స్టైలిష్ స్టార్ తో పోటీప‌డుతూ స్టెప్పులు వేయ‌డం.. చిటికె వేసిన విధానం .. అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని ఆమె చేసిన ల్యాప్ స్టెప్ యూత్ ని ఉర్రూతలూగిస్తోంది.

స‌మంత ఇంత‌కుముందు ఐట‌మ్ నంబ‌ర్ చేసినా ఇది అంత‌కుమించి అనే రేంజులో ఉంది. ఈ ఐటెమ్ నంబర్‌ పుష్పకు అద్భుతమైన ఆకర్షణగా నిలుస్తోంది. చిన్న టీజ‌ర్ తోనే ఇంత‌గా అల్లాడిస్తే పూర్తి పాట మ‌రి ఏ రేంజులో కేక పుట్టిస్తుందో చూడాల‌న్న కుతూహాలం ఫ్యాన్స్ లో పెరిగింది. డిసెంబర్ 17న థియేటర్లలో వణుకు పుట్టించేయ‌డం ఖాయం అంటూ గుస‌గుస వైర‌ల్ అవుతోంది.

Full View
Tags:    

Similar News