హ్యాండ్ లూమ్స్ బికినీ టాపులో సమంత

Update: 2017-05-25 14:21 GMT
చేనేత వస్త్రాలు అంటే ముతకగా ఉంటాయని.. ఓల్డ్ ఫ్యాషన్ అని.. వాటిని వేసుకుంటే పాత తరం మనుషులు అంటారని.. జనాల్లో అపోహ ఉంది. ఈ జనరేషన్ హ్యాండ్ లూమ్స్ .. డిజైనర్ డ్రెస్ లకు ఏ మాత్రం తీసిపోవనే విషయాన్ని ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రూవ్ చేసేసింది.

తాజాగా సమంత ఓ ఫోటో షేర్ చేసింది. గభాలున చూస్తే ఎవరో టాప్ డిజైనర్ డిజైన్ చేశారని అనుకోవడం ఖాయం. సమంత ఆ రేంజ్ లో అందాలు ఆరబోసేసింది. క్లీవేజ్ అందాల నుంచి.. నడుం మడతల వరకు.. బికినీ టాపులో అందాలను ప్రదర్శించింది. నాభి షోకులను చూపించేందుకు కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు సమంత. టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న సమంతకు ఇలా అందాలు చూపిస్తూ పోజులు ఇవ్వడం.. ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం కొత్తేమీ కాదు. అయితే.. మరో నాలుగు నెలల్లో పెళ్లి చేసుకోబోతూ కూడా ఇంత డేరింగ్ గా ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ కోసం ఈ పోజ్ ఇచ్చిన సమంత.. 'తెలంగాణ కళాకారులు'.. 'చేనేత వస్త్రాలు'.. 'హ్యాండ్ లూమ్స్ లో సెక్సీగా' అనే అర్ధం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ లు పెట్టి.. తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మరో అడుగు ముందుకు వేసేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News