రోజూ ఈ సెక్సీ లుక్కుల గోల ఏంటో

Update: 2017-09-21 11:34 GMT
సౌత్ సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు సమంత వైపే చూస్తున్నారు. మరి కొన్ని రొజుల్లో అక్కినేని కొడలవ్వబోతున్న ఈ నటి పెళ్లి కూతురిగా ముస్తాబవుతోంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో గ్లామర్ డ్రెస్సులతో సంప్రదాయ దుస్తులతో మెరిసిన సమంత ఇపుడు తన పెళ్లి వేడుకలో ఎప్పుడు కనిపించని విధంగా కనిపించడానికి రెడీ అయ్యింది.

రోజుకో డ్రెస్సులతో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తోంది. రీసెంట్ గా లెహాంగా అంటూ కొత్త స్టైల్ లో కనిపించిన సమంత ఇప్పుడు మళ్లీ దానికి కొనసాగింపుగా పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. లెహాంగా 2.0 అంటూ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఆ సెక్సీ సంప్రదాయ డ్రెస్ లో అమ్మడు చాలా అందంగా ఉంది. ఈ డ్రెస్ లో ఇంతకుముందు ఫోటోలను పోస్ట్ చేసినా వాటిని మించిన రేంజ్ లో ఉందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  

ఇప్పటికే ఎంగేజ్మెంట్ లో సమంత వేసిన డ్రెస్ చాలా ఫెమాస్ అయ్యింది. ఇప్పుడు పెళ్లి కోసం సామ్ వేస్తున్న డ్రెస్సులను ఇస్తున్న ఫోటో షూట్స్ ని చూస్తుంటే.. పెళ్లిలో సమంత ఏంజిల్ లా ఉండడం పక్కా అని అంటున్నారు. ఇక నాగ చైతన్య - సమంత ల పెళ్లి వచ్చే నెల గోవాలో జరగబోతున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News