'నా పెట్ కి నేను తల్లిగా ఫెయిలయ్యాను' అంటున్న స్టార్ హీరోయిన్

Update: 2020-06-16 13:30 GMT
టాలీవుడ్ దంపతులు అక్కినేని నాగచైతన్య.. సమంత రెండు అమెరికన్ పిట్ బుల్స్‌ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. వాటి పేర్లు హష్.. ఇంకోటి డ్రోగో. ఇటీవల సమంత, నాగ చైతన్య హష్ తొలి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు కూడా. అది చాలదన్నట్లు తన ఫ్రెండ్స్‌ని పిలిపించి మరి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చింది. అయితే హష్, డ్రోగో కంటే ముందు సమంత బూగబూ అనే కుక్క పిల్లను పెంచుకునేదట. అయితే దానికి ఓ వింత వైరస్ సోకి నాలుగు నెలల వయసులోనే చనిపోయింది. అందుకే ప్రస్తుతం హాష్.. డ్రోగో లను జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. అయితే సమంత హాష్ ని ఇంటికి తెచ్చుకోవడానికి ముందు కుక్కల్ని ఎలా పెంచాలనే అంశం పై ముప్పై రోజుల పాటు కోర్స్ పూర్తి చేసిందట. కానీ ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో హాష్ కి ఓ మంచి యజమానిగా(తల్లిగా) ఫెయిల్ అయ్యానని పోస్ట్ పెట్టింది. మొదట బుగబు అనే పెట్ చనిపోయాక హష్ ఇంటికి వచ్చిందని సమంత చెప్పింది.

ఇక తాజాగా సమంత తన ఫ్రెంచ్ బుల్‌డాగ్‌ను అడుగుతోంది: "ఇది ఎవరి బొమ్మ ఈ హాష్? ఇది ఎవరి బొమ్మ? ఇది మీ బొమ్మనా? లేదా ఇది పొరుగు బొమ్మనా? ఇది మీ బొమ్మ కాదు! నేను తల్లిగా ఫెయిల్ అయ్యాను. నా కొడుకు పక్కింట్లో నుండి బాంబిని దొంగిలించాడు. అంటూ హాష్ దిండు చాటు దాక్కున్న ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం సమంత తన పెట్ హాష్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా సమంత చివరిగా జాను సినిమాలో మెరిసింది. ఏ మాయ చేసావే సినిమాతో సినీతెరకు పరిచయం అయిన సమంత.. తన మొదటి హీరో నాగచైతన్యను వివాహం చేసుకొని హ్యాపీగా ఉంటోంది. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఇక చేసేదేం లేక ఇలా పెట్స్ తో టైంపాస్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Tags:    

Similar News